Godrej And Raymond Deal: గోద్రెజ్‌ చేతికి రేమండ్‌ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం, భారీ డీల్‌!

Godrej Consumer to acquire FMCG business of Raymond Consumer Care - Sakshi

ముంబై: గోద్రెజ్‌ కన్జూమర్‌ కేర్‌ (జీసీసీఎల్‌) తాజాగా రేమండ్‌ గ్రూప్‌నకు చెందిన ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాన్ని దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 2,825 కోట్లు. డీల్‌లో భాగంగా కండోమ్‌ బ్రాండ్‌ కామసూత్ర, పార్క్‌ అవెన్యూ మొదలైన ప్రీమియం.. డియోడరెంట్‌ బ్రాండ్లను రేమండ్‌ గ్రూప్‌ విక్రయించింది. దీంతో ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం నుంచి రేమండ్‌ గ్రూప్‌ నిష్క్రమించినట్లవుతుంది.

(చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా)

అయితే, ఆయా ఉత్పత్తులను కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి గోద్రెజ్‌ కన్జూమర్‌ కేర్‌కు విక్రయించడాన్ని కొనసాగించనుంది. ఒక రకంగా వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించడం నుంచి మాత్రమే రేమండ్‌ గ్రూప్‌ తప్పుకున్నట్లవుతుంది. మే 10 నాటికి ఈ డీల్‌ పూర్తి కాగలదని అంచనా. మరోవైపు, తమ లైఫ్‌స్టయిల్‌ తదితర వ్యాపార విభాగాలను రేమండ్‌ కన్జూమర్‌ కేర్‌ (ఆర్‌సీసీఎల్‌)లో విలీనం చేసి, లిస్ట్‌ చేయనున్నట్లు రేమండ్‌ గ్రూప్‌ తెలిపింది. రేమండ్‌ షేర్‌హోల్డర్లకు తమ దగ్గరున్న ప్రతి అయిదు షేర్లకు గాను నాలుగు ఆర్‌సీసీఎల్‌ షేర్లు లభిస్తాయి.

ఇవీ చదవండి: షాపింగ్‌ మాల్స్‌ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!

డిస్కౌంట్‌ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్‌ గోయల్‌ కీలక వ్యాఖ్యలు
నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్​: టెక్‌ సీఈవోలు, ఐపీఎల్‌ ఆటగాళ్లను మించి .!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top