అమూల్‌.. రెండంకెల వృద్ధి | GCMMF expects double-digit revenue growth in FY25 on strong Amul demand | Sakshi
Sakshi News home page

అమూల్‌.. రెండంకెల వృద్ధి

Dec 1 2024 10:20 AM | Updated on Dec 1 2024 10:50 AM

GCMMF expects double-digit revenue growth in FY25 on strong Amul demand

న్యూఢిల్లీ: అమూల్‌ బ్రాండ్‌ కింద పాలు, పాల పదార్థాల తయారీలో ఉన్న గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. తమ ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌ ఇందుకు కారణమని సంస్థ ఎండీ జయెన్‌ మెహతా తెలిపారు.

జీసీఎంఎంఎఫ్‌ 2023–24లో రూ.59,445 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎని మిది నెలల్లో తాజా పాలు, చీజ్, ఐస్‌ క్రీం సహా అన్ని ఉత్పత్తుల విభాగాల్లో డిమాండ్‌ వృద్ధి చెందిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగ టున రోజుకు 310 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేశామని మెహతా వెల్లడించారు. సంస్థ పాల ప్రాసెసింగ్‌ వార్షిక సామర్థ్యం దాదాపు 500 లక్షల లీటర్లు. యూఎస్‌ సహా దాదాపు 50 దేశాలకు పాల ఉత్పత్తులను ఈ సంస్థ ఎగుమతి చేస్తోంది.  

రూ.11,000 కోట్ల పెట్టుబడి.. 
నూతన ప్లాంట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీల కొనుగోలు ద్వారా సంస్థ సామర్థ్యాన్ని విస్తరించడానికి రూ.11,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించినట్టు తెలిపారు. ఇందులో 80 శాతం ఖర్చు చేశామన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారం మెరుగ్గా ఉందని, చాలా ప్రొడక్టులు విడుదల చేసినట్టు వివరించారు.

జీసీఎంఎంఎఫ్‌ గుజరాత్‌లోని 18,600 గ్రామాలలో 36 లక్షల మంది రైతులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రైతు యాజమాన్యంలోని పాడి పరిశ్రమ సహకార సంస్థ. 18 సభ్య సంఘాల ద్వారా రోజుకు 300 లక్షల లీటర్లకుపైగా పాలను సేకరిస్తోంది. ఇంటర్నేషనల్‌ ఫామ్‌ కంపారిజన్‌ నెట్‌వర్క్‌ ప్రకారం పాల ప్రాసెసింగ్‌ పరంగా ప్రపంచంలోని టాప్‌ 20 డెయిరీ కంపెనీలలో జీసీఎంఎంఎఫ్‌ 8వ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement