వడ్డీలు కట్టలేక చేతులెత్తేసిన ‘ఫ్యూచర్‌’!

Future Enterprises Defaults By Interest Payment Ncds On Rs 6.07 Crore - Sakshi

న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా రూ. 6.07 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. కంపెనీ గతంలో జారీ చేసిన మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు)పై ఈ నెల 20కల్లా వడ్డీ చెల్లించవలసి ఉన్నట్లు తెలియజేసింది.

అయితే ప్రతికూల పరిస్థితులతో వీటిపై వడ్డీ చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కిశోర్‌ బియానీ గ్రూప్‌ కంపెనీ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ. 120 కోట్ల విలువైన సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయ్యింది.

ఈ సెక్యూర్డ్‌ డిబెంచర్లను వార్షికంగా 10.15 శాతం కూపన్‌ రేటుతో జారీ చేసింది. కాగా.. ఈ నెల మొదట్లోనూ రూ. 29 కోట్ల విలువైన ఎన్‌సీడీలపై రూ. 1.41 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో కంపెనీ విఫలంకావడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top