Sam Bankman Fried Arrest: 94 శాతం సంపద ఆవిరి, బిలియనీర్‌కు మరో ఊహించని షాక్‌!

Former Ftx Ceo Sam Bankman Fried Arrested In Bahamas, US To Charges - Sakshi

ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్‌గా పేరు సంపాదించిన ఎఫ్‌టీఎక్స్‌ సంస్థ ఫౌండర్‌ శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఫ్రైడ్‌ అనుమానాస్పద రీతలో నిధులను తరలించారనే ఆరోపణలతో బహమాస్‌లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహామాస్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దీని తర్వాత ఫ్రైడ్‌ని యునైటెడ్ స్టేట్స్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మాన్‌హట్టన్‌లోని యూఎస్‌ అటార్నీ కార్యాలయ ప్రతినిధి బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌ను అరెస్టు చేసినట్లు ధృవీకరించినా, అతనిపై ఉన్న ఆరోపణల గురించి తెలిపేందుకు మాత్రం నిరాకరించారు.

బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ $10 బిలియన్ల FTX కస్టమర్ల నిధులను అల్మెడకు రహస్యంగా తరలించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కనీసం $1 బిలియన్ల కస్టమర్ల నిధులు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ అంశంపై బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కంపెనీ నిధులను ఎప్పుడూ రహస్యంగా బదిలీ చేయలేదని చెప్పారు. నవంబర్, డిసెంబరు చివరిలో జరిగిన ఇంటర్వ్యూలతో పాటు బహిరంగాను బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ తన రిస్క్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలను అంగీకరించాడు. అయితే మోసం చేశాడనే ఆరోపణలను మాత్రం అంగీకరించలేదు. తన యాజమాన్య వ్యాపార సంస్థ అయిన అల్మెడ రీసెర్చ్‌లోని నిధులతో FTXలో కస్టమర్ ఫండ్స్‌ని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తరలించలేదని వివరణ ఇచ్చాడు. 

కాగా నవంబర్‌ 11న క్రిప్టో ఎక్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ దివాలా తీసిందనే వార్త  క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్‌ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్‌ 12న రాయిటర్స్‌ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీక్స్‌ ఎక్ఛేంజీ నుంచి  వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని పేర్కొంది.

చదవండి  ఐటీ ఉద్యోగులకు డేంజర్‌ బెల్స్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top