Forbes top 100 Richest Indians: అదానీ, అంబానీ ఎక్కడ? టాప్‌-10 లిస్ట్‌

Forbes Richest Indians Gautam Adani Mukesh Ambani in top-2 check list here - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితా విడుదలైంది.దీని ప్రకారం భారతదేశంలోని 100 మంది సంపన్నుల సంపద 25 బిలియన్ డాలర్లు పెరిగి 800 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాదితోపోలిస్తే  స్టాక్ మార్కెట్ స్వల్పంగా తగ్గినప్పటికీ  బిలియనీర్ల సంపద  మాత్రం మరింత వృద్ధి చెందింది. ఈజాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోగా,  రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 2వ స్థానంలో  నిలిచారు.

అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగ‌జైన్  ఫోర్బ్స్ ప్రకారం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టైకూన్ గౌతమ్ అదానీ రికార్డ్-బ్రేకింగ్ ఫీట్‌తో  2008 తర్వాత మొదటిసారిగా అగ్రస్థానంలో ఉన్న క్రమాన్ని మార్చింది. అదానీ గ్రూప్ ఛైర్మ‌న్ గౌత‌మ్ ఆదానీ 150 బిలియ‌న్ డాల‌ర్ల (రూ. 1,211,460.11 కోట్లు) ఆదాయంతో  టాప్‌లో, 88 బిలియ‌న్ డాల‌ర్ల (రూ.710,723.26 కోట్లు)తో  ముఖేశ్‌ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. 

టాప్‌ -10 జాబితా: ఈ ప‌ది మంది సంపాద‌న 350 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని ఫోర్బ్స్ తెలిపింది. 
రాధాకిషన్ దమానీ:డీమార్ట్ రిటైల్ సూప‌ర్‌మార్కెట్ డీమార్ట్ య‌జమాని రాధాకిష‌న్ ద‌మ‌నీ రూ. 222,908.66 కోట్ల సంపాద‌న‌తో మూడోస్థానంలో ఉన్నారు.
సైరస్ పూనావాలా:  ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీర‌ం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ సైర‌స్ పూనావాలా (రూ.173, 642.62 కోట్లు) నాలుగో ప్లేస్‌ సాధించారు.
శివ్ నాడార్:  టెక్‌దిగ్గజం హెచ్‌సీఎల్ సంస్థ య‌జ‌మాని శివ్ నాడార్ (రూ. 172,834.97కోట్లు) ఐదో ప్లేస్‌లో ఉన్నారు. ఈ సంవత్సరం విద్య సంబంధిత  అవసరాల నిమిత్తం  662 మిలియన్‌ డాలర్లు విరాళంగా అందించడంతో ఆయన నికర విలువ భారీగా తగ్గింది. కానీ టాప్ 10లో తన ప్లేస్‌ను నిలుపుకోవడం విశేషం.
సావిత్రి జిందాల్: ఓపీ జిందాల్ ఛైర్ ప‌ర్స‌న్ సావిత్రి జిందాల్ రూ. 132, 452.97 కోట్ల ఆదాయంతో ఆరో ప్లేస్ ద‌క్కించుకున్నారు. 
దిలీప్ షాంఘ్వీ: స‌న్‌ఫార్మాసూటిక‌ల్స్ స్థాప‌కుడు దిలీప్ సంఘ్వీ రూ.125,184.21కోట్లుతో  ఏడో స్థానాన్ని ఆక్రమించారు.
హిందూజా బ్రదర్స్: హిందూజ బ్ర‌ద‌ర్స్ (రూ.122,761.29కోట్లు) ఎనిమిదో ప్లేస్‌లో నిలిచారు. 1914లో పరమానంద్ దీప్‌చంద్ హిందూజా ప్రారంభించారు. నలుగురు  బ్రదర్స్‌, శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్ , అశోక్ బహుళజాతి సమ్మేళనాన్ని నియంత్రిస్తున్నారు. 
కుమార్ బిర్లా: టెక్స్‌టైల్స్-టు-సిమెంట్ సమ్మేళనం  ఛైర్మన్ ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలువ రూ.121,146.01 కోట్లు.
బజాజ్ కుటుంబం:  40 కంపెనీల నెట్‌వర్క్‌ తో ఉన్న బజాజ్ గ్రూప్.  రూ.117,915.45 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. .1926లో ముంబయిలో జమ్నాలాల్ బజాజ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. బజాజ్ ఆటో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, మూడు చక్రాల తయారీదారులుగా పాపులర్‌  అయింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top