ఫ్లిప్‌కార్ట్‌లో వేల కోట్ల పెట్టుబడులు

Flipkart Raises Fresh Funds for 37.6 Bn Dollar Valuation Ahead of IPO - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తుంది. దేశీయంగా అమెజాన్‌, రిలయన్స్‌, టాటా గ్రూప్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న పోటీ వల్ల పబ్లిక్ లిస్టింగ్ కు సిద్ధమవుతున్న కొద్ది రోజుల ముందు ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడులను సమీకరించింది. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఇతర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లు(దాదాపు 26.8 వేల కోట్లు) సమీకరించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డ్(సీపీపీ ఇన్వెస్ట్ మెంట్స్), సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ 2, ఫ్లిప్‌కార్ట్‌ మాతృ సంస్థ వాల్ మార్ట్ ఇంక్ నేతృత్వంలో తాజాగా నిధులు 3.6 బిలియన్ డాలర్లను సేకరించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్ నేడు తెలిపింది. ఈ  రౌండ్లో డిస్ట్రబ్ ఎడి, ఖతార్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, ఖజానా నాసియోనల్ బెర్హాద్, మార్క్యూ పెట్టుబడి దారులు విల్లోబీ క్యాపిటల్, అంతరా క్యాపిటల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్ తో సహా ఇతర పెట్టుబడి దారులు పాల్గొన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్ విలువ 37.6 బిలియన్ డాలర్లకు చేరింది. జూన్ లో, మింట్ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్ ఇంటర్నెట్ రిటైలర్ లో $700 మిలియన్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ఫ్లిప్‌కార్ట్‌ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. సాఫ్ట్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలో తన మొత్తం వాటాను వాల్ మార్ట్ ఇంక్ కు విక్రయించిన మూడు సంవత్సరాల తర్వాత ఈ పరిణామం చోటు  చేసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top