ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌: స్మార్ట్‌ఫోన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ పై భారీ తగ్గింపు..! | Flipkart Big Saving Days 2021 Sale Best Offers On Mobile Phones Electronics | Sakshi
Sakshi News home page

Flipkart Big Saving Days: స్మార్ట్‌ఫోన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ పై భారీ తగ్గింపు..!

Jul 25 2021 5:48 PM | Updated on Jul 25 2021 6:05 PM

Flipkart Big Saving Days 2021 Sale Best Offers On Mobile Phones Electronics - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్   ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌ జూలై 25 ఆదివారం నుంచి జూలై 29 వరకు కొనసాగుతుంది.  బిగ్‌ సేవింగ్‌ డేస్‌లో భాగంగా  ఆపిల్‌ ఐఫోన్లు, శాంసంగ్‌,రియల్‌మి, పోకో, మోటరోలా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్‌లను అందించనుంది. బిగ్‌ సేవింగ్‌ డేస్‌లో భాగంగా ఈ రోజు స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం సేల్‌ లైవ్‌లో కొనసాగుతుంది.

స్మార్ట్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న డిస్కౌంట్‌ ధరలు

  • ఆపిల్ ఐఫోన్ 12 మినీ తగ్గింపు ధర రూ. 57,999, అసలు ధర రూ. 69,990
  • ఆపిల్ ఐఫోన్ 12 తగ్గింపు ధర రూ. 67,999, అసలు ధర రూ. 79,990
  • మోటోరోలా రేజర్‌ తగ్గింపు ధర రూ. 54, 999 అసలు ధర రూ. 1,49,999
  • ఆసుస్‌ రాగ్‌ ఫోన్‌ 3 తగ్గింపు ధర రూ. 39,999 అసలు ధర రూ. 55,999
  • మోటోరోలా జీ10 పవర్‌ తగ్గింపు ధర రూ. 9,999 అసలు ధర రూ. 12,999.
  • రియల్‌ మీ 8 తగ్గింపు ధర రూ. 13,999, అసలు ధర రూ 16, 999.
  • శాంసంగ్‌ ఎఫ్‌62 తగ్గింపు ధర రూ. 17,999 అసలు ధర రూ. 29,999.

ఎలక్ట్రానిక్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న డిస్కౌంట్‌ ధరలు

  • గో ప్రో 9 తగ్గింపు ధర రూ. 37, 499, అసలు ధర రూ. 47,000
  • శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ ఆక్టివ్‌ 2 తగ్గింపు ధర రూ. 14, 990 అసలు ధర రూ. 25,990
  • నోకియా మీడియా స్ట్రీమర్‌ తగ్గింపు ధర రూ 1,899 అసలు ధర రూ. 4,999
  • ఆసుస్‌ వివోబుక్‌ గేమింగ్‌ కోర్‌ ఐ5 ల్యాప్‌టాప్‌ తగ్గింపు ధర రూ. 52, 490, అసలు ధర రూ. 76, 990.

Advertisement
 
Advertisement
Advertisement