లాభాలు కొనసాగే అవకాశం

Experts predict that gains can continue in the stock market this week - Sakshi

క్యూ2 ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కీలకం  

ప్రపంచ పరిణామాలు, ఫెడ్‌ చైర్మన్‌ ప్రసంగాలపై దృష్టి  

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా

ముంబై: స్టాక్‌ మార్కెట్లో ఈ వారమూ లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్‌ రెండో క్వార్టర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులను గమనించవచ్చు. నవంబర్‌ 8న(బుధవారం), 10న(శుక్రవారం) ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌  ప్రసంగాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చు.

‘‘ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం ఇటీవల మార్కెట్ల ట్రేడింగ్‌పై పరిమిత ప్రభావాన్ని చూపుతోంది. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారితే మార్కెట్‌ మూమెంటం మరింత ఊపందుకుంటుంది. నిఫ్టీకి ఎగువన 19,330 – 19,440 శ్రేణిలో కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,060 వద్ద కీలక మద్దతు లభించవచ్చు’’ అని మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవిందర్‌ సింగ్‌ నందా తెలిపారు.

రెండో క్వార్టర్‌ ఫలితాలపై కన్ను  
గత వారాంతంలో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, డెల్హవరీ, వేదాంతలు వెల్లడించిన ఆర్థిక ఫలితాలకు స్టాక్‌ మార్కెట్‌ ముందుగా స్పందించాల్సి ఉంటుంది.  నిఫ్టీ 50 సూచీలోని భాగమైన దివీస్‌ ల్యాక్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, కోల్‌ ఇండియా, ఐషర్‌ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీలతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 2400 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి.  

స్థూల ఆర్థిక గణాంకాలు  
ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. చైనా అక్టోబర్‌ వాణిజ్య లోటు మంగళవారం, యూరోజోన్‌ సెపె్టంబర్‌ రిటైల్‌ విక్రయాలు బుధవారం వెల్లడి కానున్నాయి. అమెరికా వారంతాపు నిరుద్యోగ డేటా గురువారం ప్రకటించనుంది. బ్రిటన్‌ జీడీపీ వృద్ధి రేటు డేటా శుక్రవారం, అదేరోజున భారత సెపె్టంబర్‌ పారిశ్రామికోత్పత్తి, చైనా ద్రవ్యోల్బణం, వాహన విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి.  

రెండు లిస్టింగులు, 3 ఐపీఓలు  
సెల్లో వరల్డ్‌ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. అదే రోజున ఐటీ ఆధారిత సొల్యూషన్‌ కంపెనీ ప్రొటీయన్‌ ఈగవ్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ప్రారంభం కానుంది. హొనాసా కన్జూమర్‌ షేర్ల లిస్టింగ్‌ మంగళవారం(నవంబర్‌ 7న) ఉంది. ఈ రోజే అస్క్‌ ఆటోమోటివ్‌ ఐపీఓ, ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల ఐపీఓలు ప్రారంభం కానున్నాయి.  
కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు

నవంబర్‌లో 3 సెషన్లలో రూ. 3,400 కోట్లు ఉపసంహరణ
వడ్డీ రేట్ల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో రాజకీయ..¿ౌగోళిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. నవంబర్‌లో తొలి మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనే రూ. 3,412 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, అంతకు ముందు సెపె్టంబర్‌లో రూ. 14,767 కోట్ల మేర విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు.

దానికన్నా ముందు మార్చ్‌ నుంచి ఆగస్టు వరకు వరుసగా ఆరు నెలల్లో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 1.74 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. బాండ్‌ ఈల్డ్‌ల (రాబడులు) పెరుగుదలే అమ్మకాలకు ప్రధాన కారణమని, అయితే వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడ్‌ ఉదార వైఖరి తీసుకోవడంతో ఈల్డ్‌లు తిరుగుముఖం పట్టి, ఎఫ్‌పీఐల విక్రయాలకు కాస్త అడ్డుకట్ట పడొచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజిస్ట్‌ వీకే విజయకుమార్‌ తెలిపారు. 

మరోవైపు, డెట్‌ మార్కెట్లోకి అక్టోబర్‌లో రూ. 6,381 కోట్లు, నవంబర్‌ తొలి నాళ్లలో రూ. 1,984 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్‌ చేసేందుకు సానుకూల పరిస్థితులు వచ్చే వరకు నిధులను స్వల్పకాలికంగా భారతీయ డెట్‌ సాధనాలకు మళ్లించాలని ఇన్వెస్టర్లు భావిస్తుండటం ఇందుకు కారణం కావచ్చని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు నికరంగా ఈక్విటీల్లోకి రూ. 92,560 కోట్లు, డెట్‌లోకి రూ. 37,485 కోట్ల మేర వచ్చాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, క్యాపిటల్‌ గూడ్స్, ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు అత్యధికంగా పెట్టుబడులు దక్కించుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top