Ethanol Based 2023 Yamaha: యమహా గుడ్‌న్యూస్‌ చెప్పిందిగా!

Ethanol based 2023 Yamaha FZ 15 launched details inside - Sakshi

సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న  నేపథ్యంలో  తన  వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్‌ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్‌తో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్‌జెడ్‌-15ను బ్రెజిల్‌లో లాంచ్‌ చే సింది. కంపెనీ ఈ బైక్‌ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15  పేరుతో  విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్‌తో అప్‌డేట్‌ చేసి  ఇండియాలో ఇథనాల్‌ ఆధారిత   Yamaha FZ V3 బైక్‌ను త్వరలోనే  తీసుకురావచ్చని భావిస్తున్నారు. 

యమహా ఎఫ్‌జెడ్‌-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌తో వచ్చింది.  ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్‌ చేస్తుంది.  ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్‌లు ప్రొజెక్టర్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ముందు భాగంలో ABS బ్రేక్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్‌గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర  సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top