EPFO Member Can File New Provident Fund Nomination Before December 31- Sakshi
Sakshi News home page

PF New Rule: ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్?

Dec 17 2021 3:45 PM | Updated on Dec 17 2021 6:02 PM

EPFO Member Can File New Provident Fund Nomination Before December 31 - Sakshi

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 31 లోపు ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలకు నామినీ పేరును జత చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ నామినీ పేరును యాడ్ చేయకపోతే, ఈ రిటైర్‌మెంట్ బాడీ అందించే పలు ప్రయోజనాలను ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఈపీఎఫ్ అందించే ప్రయోజనాలను పొందాలంటే డిసెంబర్ 31 లోపల నామినీ పేరును తమ ఖాతాలకు జత చేసుకోవాలని, ఈ-నామినేషన్ ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌ చేసినట్లు పేర్కొంది.

భారత్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ దాదాపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. రిటైర్‌మెంట్ తర్వాత వారికి ఈపీఎఫ్ఓ ఫండ్ ఒక ముఖ్యమైన ఆదాయపు వనరుగా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఖాతా నుంచి ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తంలో కట్ చేస్తారు. ఉద్యోగి ఖాతా నుంచి ఎంత మొత్తమైతే కట్ అవుతుందో, అంతే మొత్తంలో ఎంప్లాయర్స్ కూడా ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు. డిసెంబర్ 31 లోపల నామినీ వివరాలను అప్‌డేట్ చేయకపోతే, జనవరి 2022 నుంచి పెన్షన్, ఇన్సూరెన్స్ మనీ ఎలాంటి ప్రయోజనాలను ఉద్యోగులు పొందలేరు. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాల ప్రయోజనాలు నామినీ పొందేలా కొత్త నిబంధనను ఈపీఎఫ్ రూపొందించింది.

ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. 

  • ‎‎ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి.
  • ‎‎యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.‎
  • మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
  • అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎
  • తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.‎
  • ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.  
  • వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.‎
  • ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.‎
  • ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.

(చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్‌బీఐ బ్యాంక్‌..!) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement