ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్‌, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం!

Epf Interest Rate For 2021-22 Reduced To 8.1% Lowest Since 1977-78 - Sakshi

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం షాకివ్వనుంది. 40 ఏళ్ల తరువాత తొలిసారి ఈపీఎఫ్‌ఓపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫర్‌ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్‌ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై సమావేశమైంది.

ఈ భేటీలో ఖాతాదారులకు 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ వడ్డీ రేట్లు 40ఏళ్ల మందుకు అంటే 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ఖాతాలపై 8శాతం ఇవ్వడం గమన్హారం.  

మళ్లీ 40ఏళ్ల తరువాత అదే తరహాలో వడ్డీ రేట్లు ఇవ్వడానికి కోవిడ్‌ తో పాటు ఖాతాదారుల నుంచి జమయ్యే నిధి తక్కువ ఉండటమే  ఇందుకు ప్రధాన కారణమని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

ఇంతకుముందు ఎలా ఉన్నాయ్‌!

2011 -2012 లో 8.25శాతం

2012-2013 లో 8.5శాతం

2013-2014 లో 8.75శాతం 

2015 -2016లో 8.8శాతం 

2016 - 2017లో 8.65శాతం 

2017 - 2018లో 8.55శాతం 

2018 -2019 లో 8.65శాతం 

2019-2020లో 8.5శాతం 

2020-2021లో 8.5శాతం 

2021 -2022లో 8.1శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు రిపోర్ట్‌లో హైలెట్‌ చేస్తున్నాయి. తాజా వడ్డీరేట్ల తగ్గుదల నిర్ణయాన్ని సీబీటీ సభ్యులు కేంద్ర ఆర్ధిక శాఖకు పంపనున్నారు. ఆర్ధిక శాఖ నిర్ణయంతో  ఈ తగ్గిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి.

చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top