ట్విటర్‌ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ అదిరిపోయే శుభవార్త!

Elon Musk Reveals About Twitter 2.0 The Everything App - Sakshi

సీఈవో ఎలాన్‌ మస్క్‌ నెల రోజుల వ్యవధిలో ట్విటర్‌కు చెందిన 5 వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. అయితే తాజాగా తొలగించిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించుకోనున్నట్లు తెలిపారు. ట్విటర్‌ 2.0 పేరుతో కంపెనీ భవిష్యత్‌ కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయో వివరించారు. 

ట్విటర్‌ బాస్‌ మస్క్‌ ఇటీవల ఉద్యోగులు ఎక్కువ గంటల పని చేయడంతో పాటు హార్డ్‌ వర్క్‌ చేయాలని అల్టిమేట్టం జారీ చేశారు. బాస్‌ తీరు నచ్చక ట్విటర్‌కు చెందిన 1200 టెక్కీలు రిజైన్‌ చేశారు. అదే సమయంలో టెక్నాలజీ స్టాక్‌లోని ముఖ్యమైన విభాగాలను కింది స్థాయి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టే జపాన్, భారత్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌లలో ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ విషయాలను కొంతవరకు వికేంద్రీకరించ వచ్చనే అభిప్రాయం మస్క్‌ వ్యక్తం చేశారు.

దీంతో ట్విటర్‌ హెచ్‌ఆర్‌ విభాగం ప్రపంచ వ్యాప్తంగా ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో పని చేసే సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో నవంబర్‌ 27న  త్వరలో ఉద్యోగుల నియామకం ఉండనుంది. అత్యంత ప్రభాతివంతులైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు స్వాగతం’ అంటూ మస్క్‌ పేర్కొన్నారు. 

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌

యూజర్లకు శుభవార్త
ట్విటర్‌‌‌ను ఎవ్రీథింగ్ యాప్‍గా మార్చేందుకు ఎలాన్ మస్క్ మరో ముందడుగు వేశారు ట్విటర్ 2.0లో వీడియో,ఎంటర్‌టైన్‌కు సంబంధించిన అడ్వర్టైజింగ్‌ ఎక్కువగా ఉంటుందని మస్క్ వెల్లడించారు. వీటితో పాటు ఎన్‌క్రిప్టెడ్ డీఎంలు, యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ ఎక్కువ టెక్స్ట్ ఉండే ట్వీట్‍లను పోస్ట్ చేసే సదుపాయాన్ని లాంగ్‍ఫామ్‌ రూపంలో తీసుకురానున్నట్టు మస్క్ తెలిపారు. బ్లూ వెరిఫైడ్‌ అకౌంట్‌లు రీలాంచ్, పేమెంట్స్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కాగా, ట్విటర్‌ డిసెంబర్ 2నుంచి బ్లూ వెరిఫికేషన్‌ను పునఃప్రారంభించనున్న విషయం తెలిసిందే.

చదవండి👉 వైరల్‌: ‘ట్విటర్‌లో మా ఉద్యోగాలు ఊడాయ్‌’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top