అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్‌ పేపర్లు తెస్తున్న ట్విటర్‌ ఉద్యోగులు

Elon Musk Fired Cleaning Staff Twitter Employees Bring Their Own Toilet Paper - Sakshi

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ సీఈవోగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అందులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సంస్థ నష్టాలను తగ్గించే క్రమంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మస్క్‌ తీసుకుంటున్న పలు నిర్ణయాలను చూసి కొందరు నిపుణుల సైతం షాక్‌కి గురవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టెస్లా అధినేత "క్రేజీ కాస్ట్ కటింగ్" చర్యలను చేపట్టారు.

న్యూయార్క్ టైమ్స్ తెలిపిన నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కోలోనిని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత టాయిలెట్ పేపర్‌ను ఆఫీసుకు తీసుకురావడం ప్రారంభించారట. కారణం ఏంటంటే.. ట్విటర్‌ నిర్వహణ ఖర్చులు తగ్గించే పనిలో ఉన్న మస్క్‌ భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ సంస్థలోని క్లీనింగ్‌ స్టాఫ్‌ను కూడా తొలగించారట. దీంతో బాత్‌రూంలో నిర్వహణ లేక ఉద్యోగులే వారి ఇటి నుంచి టాయిలెట్‌ పేపర్లు తీసుకువెళ్లాల్సి వస్తోందట. అధిక వేతనాల కోసం క్లీనింగ్‌ సిబ్బంది సమ్మె చేయడంతో లేఆఫ్‌ల ప్రక్రియ అందులోనూ జరిగాయి.

చదవండి: ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త ..‘ఫోల్డ్’​పై యాపిల్​ కన్ను, శాంసంగ్‌కు ధీటుగా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top