Elon Musk: నెట్టింట వైరల్‌గా మారిన ఎలాన్‌ మస్క్‌.. ‘టెస్లా సీఈఓకి ఇలాంటివి అవసరం లేదు’

Elon Musk Business Card Goes Viral Twitter - Sakshi

స్పెస్‌ ఎక్స్‌ అధినేత, టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఇలా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఎలాన్ మస్క్. ఉక్రెయిన్‌ రష్యా వార్‌పై కామెంట్‌ చేసినా, ట్విటర్‌ డీల్‌ నుంచి నుంచి వైదొలగినా, అంతెందుకు మస్క్‌ ట్విట్‌ కూడా నెట్టింట వైరల్‌ కావడమే కాదు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ వ్యాపారవేత్త చమత్కారమైన ట్వీట్‌లతో తన మిలియన్లు ఫాలోవర్లను నవ్విస్తూ ఉంటాడు. తాజాగా మస్క్‌కి సంబంధించిన ఓ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది.

1995లో తన సోదరుడు కింబాల్ మస్క్‌తో కలిసి జిప్2 అనే కంపెనీని ఎలాన్‌ మస్క్ ప్రారంభించాడు. అప్పట్లో ఓ బిజినెస్‌ కార్డుని మస్క్ పేరు మీద ప్రింట్‌ చేశారు. ఆ కార్డు ఫోటోని డాగ్‌ డిజైనర్‌ అనే ట్విటర్‌ ఖాతాదారుడు షేర్‌ చేయడంతో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ 1999లో మూసేశారు. ఈ పోస్ట్‌కు స్పందించిన ఎలాన్‌ మస్క్‌ బదులుగా ‘‘ఏన్షియంట్‌ టైమ్స్‌’’(పురాతన కాలాం) అంటు ట్విట్‌ చేశాడు.

ఈ పోస్ట్‌ చూసిన కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. తాను ఎంచుకున్న సాంకేతిక రంగంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా ఈ స్థాయికి చేరుకోవడం పట్ల ఎలాన్‌ మస్క్‌ని అభినందిస్తున్నారు. టెస్లా సీఈఓ అంటేనే బ్రాండ్‌ అని, తనకు ఇలాంటి బిజినెస్‌ కార్డులు అవసరం లేదని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top