జాతికి ముప్పు చేసే టెక్నాలజీలు | Droupadi Murmu emphasized her govt efforts to enhance efficiency in cybersecurity and DeepFake technology | Sakshi
Sakshi News home page

జాతికి ముప్పు చేసే టెక్నాలజీలు

Jan 31 2025 1:02 PM | Updated on Jan 31 2025 1:49 PM

Droupadi Murmu emphasized her govt efforts to enhance efficiency in cybersecurity and DeepFake technology

కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పారు. డిజిటల్ మోసం, సైబర్ క్రైమ్, డీప్‌ఫేక్‌ వంటి టెక్నాలజీల ద్వారా పెరుగుతున్న బెదిరింపులను ఆమె అంగీకరించారు. ఇవి సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రత పట్ల ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని అన్నారు.

సైబర్ సెక్యూరిటీ

డిజిటల్ బెదిరింపుల నుంచి పౌరులు, సంస్థలను రక్షించడానికి సైబర్ భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము పేర్కొన్నారు. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్ పెరగడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదాల నుంచి రక్షణకు పటిష్టమైన చర్యలు అవసరమని తెలిపారు. సైబర్ బెదిరింపులను సమర్థంగా గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి, అందుకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి అధునాతన సాంకేతికతలు, వ్యూహాలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ

అత్యంత వాస్తవికంగా కనిపించేలా నకిలీ చిత్రాలు, వీడియోలు, ఆడియోలను సృష్టించే డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సమాచార సమగ్రతకు, ప్రజల నమ్మకానికి ముప్పు కలిగిస్తుంది. అధునాతన డిటెక్షన్ అండ్ మిటిగేషన్ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ సవాలును ఎదుర్కోవాల్సి ఉందని ముర్ము అన్నారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సమాచారాన్ని ముందే పసిగట్టి ఆదిలోనే దాన్ని కట్టడి చేసేందుకు వీలుగా టెక్ నిపుణులు, పరిశోధకులతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌

జాతీయ భద్రత పెంపు

సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థలు, సున్నితమైన డేటాను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, డిజిటల్ యుగంలో దేశ భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement