దొడ్ల ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 421-428

Dodla Dairy IPO Band  Fixed At Rs 421 IPO Will Close At June 18  - Sakshi

జూన్‌ 16 నుంచి 18 వరకు ఐపీవో

రూ. 50 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం

ముంబై: దక్షిణ భారత్‌లోని ప్రైవేట్‌ డెయిరీలో ఒకటైన దొడ్ల తొలిసారిగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. జూన్‌ 16 నుంచి 18 వరకు ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) అందుబాటులో ఉంటుంది. షేర్‌బ్యాండ్‌ విడ్త్‌ని రూ. 421 నుంచి 428గా నిర్ణయించారు. మొత్తంగా ఒక కోటి తొమ్మిది లక్షల షేర్లు ఐపీవోలకి రానున్నాయి.

ఐపీవో వివరాలు
దొడ్ల జారీ చేసిన ఐపీవోలు 50 శాతం షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్సిస్టిట్యూషన్‌ బయ్యర్స్‌కి కేటాయించారు. మిగిలిన షేర్లలో 35 శాతం రిటైల్‌, మిగిలిన 15 శాతం వాటాలను నాన్‌ ఇన్సిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలలో దొడ్ల డైయిరీ పాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తోంది. 2021 మార్చి నాటికి సగటున రోజకు పది లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నట్టు దొడ్ల డెయిరీ ప్రకటించింది. 

చదవండి : stockmarkets: రికార్డుల మోత

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top