నిమిషం ఆదాయంలో టాప్‌ ఏదంటే.. రోజు వారీ లాభంలో మాత్రం యాపిల్‌

Did You Know Amazon Google Earn How Much Revenue In One Minute - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌.. దిగ్గజ కంపెనీలుగా ఒక వెలుగు వెలుగుతున్నాయి. రకరకాల సర్వీసులతో ఈ బడా బడా కంపెనీలు ప్రజలకు చేరువ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తున్న ఆదాయం బిలియన్ల డాలర్లలో ఉంటుందన్నది ఊహించిందే. కానీ, ఆ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తాయో ఊహించగలరా? ఈ క్యూరియాసిటీని గుర్తించిన టెక్‌ నిపుణుడు..జర్నలిస్ట్‌ జోన్‌ ఎర్లిచ్‌మన్‌ ఒక అంచనాతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 

అమెజాన్‌ కంపెనీ నిమిషం రెవెన్యూ 8,37,000 అమెరికన్‌ డాలర్లు(మన కరెన్సీలో ఆరున్నర కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు)!, ఆ తర్వాతి ప్లేస్‌లో యాపిల్‌ 6,92,000 డాలర్లు(ఐదు కోట్లుపైనే) ఉంది. గూగుల్‌ 4,23,000 డాలర్లు(మూడు కోట్ల రూపాయలపైనే), మైక్రోసాఫ్ట్‌ 3,22,000 డాలర్లు, ఫేస్‌బుక్‌ రెవెన్యూ నిమిషానికి 2,02,000 డాలర్లు, డిస్నీ కంపెనీ లక్షా ఇరవై వేల డాలర్లు, టెస్లా ఎనభై వేల డాలర్లు, కోకా కోలా 70,000 డాలర్లు, నెట్‌ఫ్లిక్స్‌ 55 వేల డాలర్లు, కాఫీ స్టోర్‌ల ఫ్రాంఛైజీ స్టార్‌బక్స్‌ 52,000 డాలర్లు, మెక్‌ డొనాల్డ్స్‌ 40 వేలడాలర్లుగా నిమిషపు రెవెన్యూ ఉందని, ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లెక్కల ప్రకారం(జులై రెండోవారం).. ఇది ఒక అంచనా మాత్రమేనని ఎర్లిచ్‌మన్‌ స్పష్టం చేశాడు.

 

ఇక రోజూ వారీ లాభం సుమారు 
యాపిల్‌ ఒక్కరోజు లాభం 240 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు(సుమారు 1,700 కోట్లు)గా ఉంది. గూగుల్‌ 182 మిలియన్‌ డాలర్లు, మైక్రోసాఫ్ట్‌ 162 మిలియన్‌ డాలర్లు, ఫేస్‌బుక్‌ 109 మిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ 102 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. మొత్తంగా వీటి రోజూవారీ లాభం అంతా కలిసి 795 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. 

బిలియన్‌ సంపాదనకు..
1994లో ప్రారంభమైన అమెజాన్‌ ఐదేళ్లలో బిలియన్‌ సంపాదన మార్క్‌ను చేరుకోగా, గూగుల్‌ ఐదేళ్లలో, యాపిల్‌ ఆరేళ్లలో, ఉబెర్‌ ఆరేళ్లలో, పేపాల్‌ ఏడేళ్లలో, ట్విటర్‌ ఎనిమిదేళ్లలో, నెట్‌ఫ్లిక్స్ తొమిదేళ్లలో బిలియన్‌ రెవెన్యూను ఖాతాలో వేసుకోగలిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top