షావోమి నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌

Details about Xioami Pro 12 Smart Phone - Sakshi

ఇంత కాలం ఎంట్రీ, మిడ్‌ లెవల్‌ సెగ్మెంట్‌లోనే ప్రభావం చూపించిన షావోమి సంస్థ తాజాగా హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై ఫోకస్‌ చేసింది. అందులో భాగంగా హై ఎండ్‌పై కేటగిరిలో షావోమి 12 ప్రో 5జీ మోడల్‌ని రిలీజ్‌ చేసింది. 2022 మే 3 నుంచి ఎంఐ డాట్‌ కామ్‌, అమెజాన్‌లో ఈ మొబైల్‌ అందుబాటులో ఉంది.

షావోమి సంస్థ ముందు నుంచి బట్జెట్‌ ఫోన్ల తయారీపై దృష్టి పెట్టింది. రూ. 15 వేల లోపు ఫోన్లలో షావోమిదే ఆధితప్యం. ప్రీమియం కేటగిరిలో కొన్ని మోడళ్లు తెచ్చినా పెద్దగా సక్సెస్‌ కాలేదు. పోకో పేరుతో రిలీజ్‌ చేసిన హై ఎండ్‌ ఫోన్లు కూడా మార్కెట్‌లో ఎక్కువ కాలం నిలవలేక పోయాయి. దీంతో ఎలాగైనా ఈ కేటగిరీలో సక్సెస్‌ కొట్టే లక్ష్యంతో 12 ప్రో 5జీ మోడల్‌ని తెచ్చింది. 

ఫీచర్స్‌
- 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
- 120 వాట్స్‌ హైపర్‌ ఛార్జర్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌
- ఇండస్ట్రీ లీడింగ్‌ ప్రాసెసరైన స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1
- వెనుక వైపు ఉన్న మూడు కెమెరాలు 50 మెగా పిక్సెల్స్‌
- ఆల్ట్రా ఫోకస్‌ నైట్‌ మోడ్‌
- 4 హార్మాన్‌ కార్దాన్‌ స్పీకర్లు (2 వూఫర్స్‌, 2 ట్వీటర్స్‌)
- 6.73 ఇంచ్‌ , 120 హెర్జ్‌, 10 బిట్‌ 2కే ప్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే
- కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక‌్షన్‌
- నాయర్‌ బ్లాక్‌, కౌషర్‌ బ్లూ, ఓపెరా మావే కలర్స్‌
- 8కే, 4కే వీడియో రికార్డింగ్‌
- 2022 మే 2 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లో లభ్యం
- ధర రూ.62,999 (8 జీబీ/ 256 జీబీ), ధర రూ.66,999 (12 జీబీ/ 256 జీబీ)

చదవండి: యాపిల్‌ నుంచి కొత్తగా స్మార్ట్‌ బాటిల్స్‌! ధర ఎంతంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top