EPFO Adds Around 15.41 Mn Net Subscribers In September 2021 - Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 15.41 లక్షల సభ్యులు

Nov 22 2021 8:30 AM | Updated on Nov 22 2021 11:20 AM

Details About EPFO Subscriptions In 2021 September - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కిందకు సెప్టెంబర్‌ నెలలో కొత్తగా 15.41 లక్షల మంది వచ్చి చేరారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కొత్త సభ్యులు 13.60 లక్షల మందితో పోలిస్తే 13 శాతం పెరిగినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క మే నెల మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నికరంగా సభ్యుల చేరిక పెరగడం గమనార్హం. నికర కొత్త సభ్యుల చేరిక ఏప్రిల్‌లో రూ.8,06,765 కాగా, మేలో 5,62,216కు తగ్గింది. తర్వాత జూన్‌లో 9,71,244 మంది చేరగా, జూలైలో 12,30,696 మంది ఈపీఎఫ్‌వోలో భాగమయ్యారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) నికర సభ్యుల చేరిక రూ.64.72 లక్షలుగా ఉంది. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా వచ్చిన వారి సంఖ్య 77.08 లక్షలుగా ఉండడం గమనార్హం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement