ప్రైవేట్‌ జెట్స్‌కు ‘కరోనా’ రెక్కలు

Demand for private aviation surges in response to COVID-19 - Sakshi

సంపన్నుల నుంచి భారీగా డిమాండ్‌

గంటకు రూ. 85 వేల నుంచి 4 లక్షల దాకా చార్జీలు

మేక్‌మైట్రిప్‌ తదితర సంస్థలు రంగంలోకి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకుని సాధారణ రవాణా సాధనాల దాకా దాదాపు అన్నీ స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రయాణాలపరంగా కాస్త వెసులుబాటు లభించినప్పటికీ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రైవేట్‌ విమానాలకు డిమాండ్‌ భారీగా నెలకొంది. దీంతో వాటి చార్జీలకు కూడా బాగా రెక్కలొచ్చాయి. కరోనా వ్యాప్తి భయాల కారణంగా బడా పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐ) దేశీయంగానైనా, విదేశాలకైనా సాధారణ ఫ్లయిట్లలో ప్రయాణించేందుకు ఇష్టపడకపోతుండటం, ప్రైవేట్‌ జెట్‌లవైపు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం. దీంతో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్‌ జెట్‌ కంపెనీలతో పాటు కొన్ని షెడ్యూల్డ్‌ విమానయాన సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసుల పోర్టల్‌ .. మేక్‌మైట్రిప్‌ కూడా తాజాగా బరిలోకి దిగింది. ప్రయాణాలపై ఆంక్షలు తొలగడంతో వివిధ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఫ్లయిట్‌లను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇతరత్రా రవాణా సాధనాలపైనా దృష్టి పెడుతున్నారని మేక్‌మైట్రిప్‌ సీవోవో (ఫ్లయిట్స్‌ వ్యాపార విభాగం) సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.  

సురక్షితం, సౌకర్యవంతం..
భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉండటంతో పాటు సురక్షితంగా, తమకు కావాల్సిన విధంగా ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్‌ విమానాలు ఉపయోగకరంగా ఉంటున్నాయని సౌజన్య తెలిపారు. దీంతో వీటిని అద్దెకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. మరోవైపు, కరోనా వైరస్‌ రాక మునుపు రోజుకు 30–40 చార్టర్‌ రిక్వెస్ట్‌లు వచ్చేవని ప్రస్తుతం డిమాండ్‌ తొమ్మిది రెట్లు పెరిగిందని జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సీఈవో కనికా టేక్రివాల్‌ తెలిపారు.

అయితే, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రాత్రికి రాత్రి ప్రయాణ నిబంధనలు మారిపోతుండటంతో కేవలం 50–60 శాతం మాత్రమే సర్వీసులు అందించగలుగుతున్నామని వివరించారు. మేక్‌మైట్రిప్‌ ప్రధానంగా కార్పొరేట్లు, హెచ్‌ఎన్‌ఐలు, సంపన్న ప్రయాణికులు లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న జెట్‌సెట్‌గో క్లయింట్ల సంఖ్య చాలా విస్తృతంగానే ఉంది. ఫార్చూన్‌ 500 కంపెనీల సీఈవోలు మొదలుకుని, సినిమా నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడాకారులు, హెచ్‌ఎన్‌ఐఏలు మొదలైన వారు క్లయింట్లుగా ఉన్నారు. ఇక  2016 నుంచి ఎయిర్‌ చార్టర్‌ వ్యాపారంలో ఉన్న జెట్‌స్మార్ట్‌ (ఇండ్‌జెట్స్‌ ఇండియా) సంస్థకు ప్రముఖ లాయర్లు, వ్యాపారవేత్తలు మొదలైనవారు క్లయింట్లుగా ఉన్నారు.

ఖరీదైన వ్యవహారమే...
ప్రైవేట్‌ విమానాలను సాధారణంగా మెట్రో నగరాల మధ్య, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రథమ శ్రేణి పట్టణాలకు ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఎంచుకుంటున్నారు. ఇదేమంత చౌకైన వ్యవహారం మాత్రం కాదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్‌ జెట్‌ అద్దె చార్జీలు గంటకు రూ. 85,000 నుంచి రూ. 4 లక్షల దాకా ఉంటోందని జెట్‌స్మార్ట్‌ సీఈవో అనూప్‌ సెహాన్‌ తెలిపారు. దీనికి జీఎస్‌టీ, ఎయిర్‌పోర్ట్‌ చార్జీలు మొదలైనవి అదనం. ఒకవేళ వన్‌–వే ట్రిప్‌ అయిన పక్షంలో సదరు విమానం తిరిగి వెళ్లేందుకు అయ్యే చార్జీలను కూడా కట్టాల్సి ఉంటుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-05-2021
May 09, 2021, 02:41 IST
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్‌ సోకి...
09-05-2021
May 09, 2021, 01:57 IST
సాక్షి, ముంబై: బ్రేక్‌ ద చైన్‌లో భాగంగా గత నెల 14వ తేదీన అమలు చేసిన లాక్‌డౌన్‌ గడువు ఈ...
09-05-2021
May 09, 2021, 00:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు,...
08-05-2021
May 08, 2021, 23:13 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్...
08-05-2021
May 08, 2021, 21:53 IST
ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బాబా సెహగల్‌ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.....
08-05-2021
May 08, 2021, 20:46 IST
జైపూర్‌: ​కోవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతిమయాత్రకు హాజరైనా వారిలో 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని శిఖర్‌ జిల్లాలోని...
08-05-2021
May 08, 2021, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌పై...
08-05-2021
May 08, 2021, 19:32 IST
ముంబై: టీమిండియా ఆటగాడు అజింక్య ర‌హానే క‌రోనా టీకా తీసుకున్నాడు. త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని క‌రోనా వ్యాక్సిన్ కేంద్రంలో...
08-05-2021
May 08, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
08-05-2021
May 08, 2021, 18:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు...
08-05-2021
May 08, 2021, 18:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌...
08-05-2021
May 08, 2021, 17:28 IST
భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60)...
08-05-2021
May 08, 2021, 17:00 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్‌ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్‌ లాంటి...
08-05-2021
May 08, 2021, 16:26 IST
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్...
08-05-2021
May 08, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌...
08-05-2021
May 08, 2021, 15:28 IST
రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి...
08-05-2021
May 08, 2021, 15:20 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు...
08-05-2021
May 08, 2021, 15:07 IST
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌...
08-05-2021
May 08, 2021, 15:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి రెండో డోసు వేసుకునే లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర...
08-05-2021
May 08, 2021, 14:55 IST
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top