ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..! డెలాయిట్‌ సర్వే వెల్లడి...

Deloitte Survey Annual Salary Increments Expected To Touch 8 6 In 2022 - Sakshi

కోవిడ్‌ రాకతో ఐటీ సంస్థల్లో నెలకొన్న అనిశ్చితితో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. అంతేకాకుండా పలు వ్యాపార కార్యకలాపాలు కూడా  గణనీయంగా పడిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే కోవిడ్‌ నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నాయి. దాంతో పాటుగా పలు మల్టీనేషనల్‌ కంపెనీలు కూడా భారీగా ఉద్యోగ నియమాకాలను చేపడుతున్నాయి. తాజాగా డెలాయిట్‌ చేపట్టిన సర్వే ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ను అందించింది.
చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్‌-10 లో ఇండియన్‌ ఫ్యామిలీ..!

వచ్చే ఏడాది వేతనాల పెంపు..!
ఇప్పటికే పలు ఐటీ కంపెనీల్లో  పనిచేస్తోన్న ఉద్యోగులకు వచ్చే ఏడాది 2022లో సుమారు 8.6 శాతం వరకు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని డెలాయిట్‌ తన సర్వేలో వెల్లడించింది.  2022 నాటికి పలు సంస్థలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని డెలాయిట్‌ సర్వే పేర్కొంది. కంపెనీలోని టాప్‌పర్ఫార్మర్స్‌కు సగటు ఉద్యోగుల కంటే 1.8 రెట్లు ఎక్కువ ఎక్కువ వేతనాలు పొందుతారని డెలాయిట్‌ తన సర్వేలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీల్లో సుమారు 12 శాతం ఉద్యోగులకు ప్రమోషన్స్‌ను పొందారు. 2020లో ఇది 10 శాతంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలు సుమారు 78 శాతం మేర నియామకాలను చేపడుతున్నాయి. 

పర్యాటక రంగంలో అంతంతే..!
రిటైల్‌, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, మౌలిక, రియాలీటీ రంగంలో వేతనాల పెంపు ఉండక్కపోవచ్చునని డెలాయిట్‌ అభిప్రాయపడింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు జంకుతుండడంతో పర్యాటకరంగంలో వేతనాల పెంపు ఉండకపోవచ్చునని డెలాయిట్‌ సర్వే పేర్కొంది. 
చదవండి: Bitcoin: బిట్‌కాయిన్‌ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్‌ సంచలన ప్రకటన..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top