ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్‌-10 లో ఇండియన్‌ ఫ్యామిలీ..!

World Richest Families 2021 By Bloomberg - Sakshi

ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తులు అంటే జెఫ్‌ బెజోస్‌, ఎలన్‌ మస్క్‌, బిల్‌గేట్స్‌ అని చెప్తాం. ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఏవంటే జెఫ్‌ బెజోస్‌, ఎలన్‌ మస్క్‌, బిల్‌గేట్స్‌ కుటుంబాలు మాత్రం కావు. తాజాగా ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్‌  నివేదిక ప్రకారం..గత సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల సంపద ఏకంగా 22 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచంలోని టాప్‌ 25 బిలియనీర్‌ కుటుంబాలు గత ఏడాది సుమారు 312 బిలియన్‌  డాలర్లను పొందినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.
చదవండి: Bitcoin: బిట్‌కాయిన్‌ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్‌ సంచలన ప్రకటన..!

అత్యంత సంపన్న కుటుంబాల్లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ సంస్థను నిర్వహిస్తోన్న వాల్టన్‌ కుటుంబం తొలి స్థానాన్ని సాధించింది. వాల్టన్‌ కుటుంబం వరుసగా నాలుగు సార్లు అత్యంత సంపన్న కుటుంబ జాబితాలో చోటు దక్కింది. రెండో స్థానంలో ఫ్రాంక్‌ మార్స్‌ కుటుంబం, మూడో స్థానంలో  కోచ్‌ ఇండస్ట్రీస్‌ నిర్వాహకులు, నాలుగో స్థానంలో ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హీర్మేస్‌ కుటుంబం, ఐదో స్థానంలో సౌదీకి చెందిన అల్‌సౌద్‌ రాజ కుటుంబాలు నిలిచాయి. అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేశ్‌ అంబానీ కుటుంబం ఆరో స్థానంలో నిలిచింది. 

ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన టాప్‌-10 కుటుంబాలు
క్రమసంఖ్య కుటుంబం  కంపెనీ  కుటుంబఆస్తుల విలువ
1. వాల్టన్‌  వాల్‌మార్ట్‌ కంపెనీ 238.2 బిలియన్‌ డాలర్లు
2. ఫ్రాంక్‌ మార్స్‌ మార్స్‌ చాక్లెట్‌ కంపెనీ 141.9 బిలియన్‌ డాలర్లు
3. కోచ్‌ కోచ్‌ ఇండస్ట్రీస్‌ 124.4 బిలియన్‌ డాలర్లు
4. హీర్మేస్‌ హీర్మెస్‌ లగ్జరీ ఉత్పత్తులు 111.6 బిలియన్‌ డాలర్లు
5. అల్‌ సౌద్‌ ఇండస్ట్రీస్‌ 100 బిలియన్‌ డాలర్లు
6. ముఖేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 93.7 బిలియన్‌ డాలర్లు
7. వెర్టైమర్‌ చానెల్‌ లగ్జరీ ఉత్పతులు 61.8  బిలియన్‌ డాలర్లు
8. జాన్సన్‌ ఫిడెలిటి ఇన్వెస్ట్‌మెంట్స్‌ 61.2 బిలియన్‌ డాలర్లు
9. థామ్సన్‌ థామ్సన్‌ రైయిటర్స్‌, మీడియా 61.1 బిలియన్‌ డాలర్లు
10. బోహ్రింగర్, వాన్ బాంబాచ్ బోహ్రింగర్ ఇంగెల్‌హీమ్ 
ఫార్మాస్యూటికల్స్ కంపెనీ
59.2 బిలియన్‌ డాలర్లు

చదవండి: స్టాక్‌ మార్కెట్‌లో హర్షద్‌ మెహతాని ఢీ కొట్టిన దమ్ము దమానీదే

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top