చెంపదెబ్బ కొట్టిన రోబోట్: వీడియో | Dancing Robot Slaps Child In Face At Public Show In China | Sakshi
Sakshi News home page

డ్యాన్స్ వేస్తూ.. చెంపదెబ్బ కొట్టిన రోబోట్: వీడియో

Mar 30 2026 2:57 PM | Updated on Mar 30 2026 4:16 PM

Dancing Robot Slaps Child In Face At Public Show In China

హ్యుమానాయిడ్స్ రోబోల తయారీలో చైనా చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. అక్కడి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రోబోలను పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే.. కొత్త రోబోల ప్రదర్శన సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మార్చి 21న చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు.అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.

ఈ రోబోట్.. చైనా టెక్నాలజీ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన జీ1 హ్యూమనాయిడ్ మోడల్ అని తెలుస్తోంది. సుమారు 35 కేజీల బరువున్న ఈ రోబో ధర 13500 డాలర్లు. దీనిని రీసెర్చ్, ఎడ్యుకేషన్, కమర్షియల్ ఉపయోగం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్న. ఎంత ప్రమాదకరమైన ప్రదర్శన  చెప్పగా.. చిన్నారికి తగలడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇంకొకరు పేర్కొన్నారు.

కంపెనీలకు సూచనలు
రోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుండా ప్రజలకు ఇబ్బంది, లేకుండా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గతంలో జరిగిన సంఘటన
రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.

ఇదీ చదవండి: ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement