
ముంబై: మూడు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌కి బూస్ట్‌ని అందించాయి. ముఖ్యంగా కీలకమైన రెపోరేటు, రివర్స్ రెపోరేటులో ఎటువంటి మార్పులు చేయకపోవడం సానుకూలంగా మారింది. దీంతో ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండు సూచీలు లాభపడ్డాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. 59,256 పాయింట్ల దగ్గర మొదలైన పరుగు ఓ దశలో గరిష్టంగా 59,654 పాయింట్లను తాకింది. అయితే చివరి గంటలో కొద్దిగా అమ్మకాలు సాగడంతో మార్కెట్ ముగిసే సమయానికి 412 పాయింట్ల లాభంతో 59,447 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ విషయానికి వస్తే 145 పాయింట్లు లాభపడి 17,784 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్ కంపెనీల షేర్లు 0.98 శాతం వృద్ధి చూపించగా స్మాల్‌క్యాప్ కంపెనీలు 0.39 వృద్ధిని కనబరిచాయి.
ఐటీసీ, రెడ్డీస్, ఎంఅండ్‌ఎం, టైటాన్, రిలయన్స్, టాటాస్టీల్ షేర్లు లాభాలు పొందగా టెక్‌మహీద్రా, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.