
ముంబై: వరుస నష్టాలకు స్టాక్ మార్కెట్‌లో బ్రేక్ పడింది. క్రితం రోజు సూచీలు భారీగా నష్టపోవడంతో అనేక కంపెనీల షేర్ల ధరలు దిగి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధం , మూడో ప్రపంచ యుద్ధమంటూ రష్యా చేసిన హెచ్చరికలు మార్కెట్‌ను ప్రభావితం చేయలేకపోయాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ఈ రోజును ముగించాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. ఉదయం 9 గంటలకు 57,066 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత పైపైకి వెళ్లింది. ఓ దశలో 57,442 పాయింట్లను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 776 పాయింట్ల లాభంతో 57,356 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 246 పాయింట్లు లాభపడి 17,200 పాయింట్ల దగ్గర ముగిసింది.
చదవండి: Stock Market: రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం!