సీఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy at CII Conference On Education - Sakshi

హైదరాబాద్ : హోటల్ వెస్టిన్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదస్సు ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపక అవకాశాలు’అంశంపై సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.  

తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తాం.. ఇందులో భాగంగా 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం.స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని..గతంలో అవుటర్ రింగ్రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఐఐ సదస్సులో సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం.పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. గర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top