బంపర్‌ ఆఫర్‌! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?

Chinese Employee Snags 365 Days Of Paid Leave In Company Raffle - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో వర్క్‌ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అయ్యో... అని నిట్టూరిస్తున్న పరిస్థితి. అలాంటిది  ఒక ఉద్యోగికి 365 రోజులు  పెయిడ్‌ లీవ్‌ ఇస్తే.. వావ్‌.. అది కదా బంపర్‌ఆఫర్‌ అంటే. చైనాలోని ఒక ఉద్యోగి ఇలాంటి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన లీవ్‌ లభించింది. ఆఫీసుకు  వెళ్లాల్సిన అవసరం లేకుండానే,  ఎలాంటి విధులు నిర్వహించకుండానే  అతనికి నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ చదవాల్సిందే. (రాధిక మర్చంట్‌, ఫ్రెండ్‌ ఒర్రీ: ఈ టీషర్ట్‌, షార్ట్‌ విలువ తెలిస్తే షాకవుతారు)

స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించిన ప్రకారం చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రం షెన్‌జెన్‌ పట్టణంలోని పేరు వెల్లడించని కంపెనీ తమ ఉద్యోగి ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పించాలని భావించింది. వారిలో  నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ఆనోచన తోవిందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఈ  డ్రా గెలుచుకున్న వారికి అధిక వేతనం, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. (సల్మాన్‌ ఖాన్‌ మూవీ బూస్ట్‌: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్‌)

పెనాల్టీ కార్డులు కూడా ఈ డ్రాలో  జోడించింది. అంటే పార్టీలో వెయిటర్‌గా వ్యవహరించడం లేదా ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమై ఒక రకంగా భయంకరమైన పానీయం తాగడం లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తోసి రాజని మేనేజర్‌ స్థాయి ఉద్యోగి ఒకరు 365 రోజుల సెలవుతో కూడిన బంపర్‌ప్రైజ్‌ గెల్చుకోవడంతో ఎగిరి గంతేశాడు.  అతడు దీనికి సంబంధించిన  చెక్ పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)

మరోవైపు కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి చెన్ మాట్లాడుతూ ఈ  సెలవును నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా లేదా ఆనందించాలనుకుంటున్నారా అనేది నిర్ణయించడానికి విజేతతో కంపెనీ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top