రాధిక మర్చంట్‌, ఫ్రెండ్‌ ఒర్రీ: ఈ టీషర్ట్‌, షార్ట్‌ విలువ తెలిస్తే షాకవుతారు | AnantAmbani bash you know the cost of Radhika Orhan Awatramani friends shorts tshirt | Sakshi
Sakshi News home page

రాధిక మర్చంట్‌, ఫ్రెండ్‌ ఒర్రీ: ఈ టీషర్ట్‌, షార్ట్‌ విలువ తెలిస్తే షాకవుతారు

Apr 14 2023 9:22 PM | Updated on Apr 14 2023 9:38 PM

AnantAmbani bash you know the cost of Radhika Orhan Awatramani friends shorts tshirt - Sakshi

సాక్షి,ముంబై: రిలయన్స్‌ అధినేత అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్‌ ‍ స్నేహితుడు ఓర్హాన్ అవతరమణి (ఒర్రీ) తెగ సందడి చేశాడు. దుబాయ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన అనంత్ అంబానీ బర్త్‌డే బాష్‌లో ఖరీదైన దుస్తులు,  ఎటైర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. స్టార్‌ కిడ్స్‌ బర్త్‌డే బాష్‌ ఆ సందడి లెవలే వేరుంటది. ఈ ఎ ంజాయ్‌మెంట్‌ కతే వేరుంటంది.  ఎవరికి వాళ్లు స్పెషల్‌గా ఉండాల్సిందే.

ముఖ్యంగా దుబాయ్‌లో అనంత్‌ 28 పేరుతో నిర్వహించిన బర్త్‌డే ఈవెంట్‌లో  రాధికా మర్చంట్, ఒర్రీ తదితరులు ధరించిన టీ షర్ట్స్‌  ధర   40వేలు, షార్ట్‌లు రూ. 45వేలు. అలాగే ఒర్రీ ధరించిన రూ. 10,000 ఖరీదు చేసే నైక్ స్నీకర్లు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అలాగే ఇటీవల నిర్వహించిన ఎన్‌ఎంఏసీసీఏ ఈవెంట్‌లోరూ. 3 లక్షల విలువైన డిజైనర్ సూట్‌ను ధరించాడట.ఈ నవ్‌భూమి సెట్ చాలా తేలికగా ఉండే ఆర్గాన్జా సిల్క్‌తో తయారు చేసింది.దీంతోపాటు షీర్ ట్యాంక్ టాప్స్ కూడా ధరించాడు. అలాగే రాధిక మర్చంట్ రూ.2 కోట్ల విలువైన క్లచ్‌తో  వార్తల్లో నిలిచారు. అనంత్‌ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లో స్కైడైవింగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

కాగా నైసా దేవగన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌తో సహా పలువురు స్టార్ కిడ్స్‌కి మంచి  ఫ్రెండ్‌ ఒర్రీ. జోర్జ్ , షహనాజ్ అవత్రమణిలకు  ఆగస్ట్ 1999లో జన్మించాడు.   సింగర్‌, రైటర్‌, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు.  ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి మూడు లక్షల మందికి పైగా  ఫాలోవర్లతో ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ కూడా. 2017లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేరాడు.

ఎప్పుడూ డిజైనర్ దుస్తులనే ధరించే ఒర్రీ ఖుషీ కపూర్‌తో ఇటీవలి ఫోటోలో 55000 విలువైన బుర్బెర్రీస్ కో-ఆర్డ్ సెట్‌ను ధరించాడు. అలాగే వేసుకున్న షూ ధర రూ. 90వేలు. బ్రాస్‌లెట్  ఖరీదు  రూ. 5.73 లక్షలు.అతను ధర రూ. 30000 ధరించిన తెల్లటి చొక్కా ధరించిన మరొక ఫోటోను పంచుకున్నాడు. బ్రాండ్ ఓర్లెబార్ బ్రౌన్ షార్ట్‌  రూ. 47వేలకు పై మాటే. ఇక అతను ధరించే రోలెక్స్ వాచ్ విలువ రూ. 72 లక్షలు . బాలెన్‌సియాగా  షూస్‌ ధర రూ. 90వేలు.  వీటనికి తోడు Mercedes-Benz G-వ్యాగన్‌ కారు కూడా  అతని సొంతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement