Internet Speed : ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎంత వస్తుందో ఇలా చెక్‌ చేయండి..!

Check Your Internet Speed With These Amazing Application - Sakshi

మన నిత్యజీవితంలో ఇంటర్నెట్‌ ఒక భాగమైంది. ఇంటర్నెట్‌ లేకుండా మన డే స్టార్ట్‌ అవ్వడం కష్టమే. సాంకేతిక కారణాల వల్ల మనకు ఇంటర్నెట్‌ స్పీడ్‌ కొంచెం స్లోగా వస్తుంది. పలు టెలికాం నెట్‌వర్క్స్ సంస్థలు మా నెట్‌వర్క్‌​ ఇంతా స్పీడ్‌ వస్తోందని యాడ్స్‌ను ఇవ్వడం మనం చూసే ఉంటాం. వారు చెప్పేది ఒకటి మనకు వచ్చే ఇంటర్నెట్‌ స్పీడ్‌ మరొకటి.

మనం వాడుతున్న ఆయా టెలికాం నెట్‌వర్క్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎంత వస్తుందో అనే విషయాన్ని పలు యాప్స్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చును. మీకు ఆయా టెలికాం నెట్‌వర్క్‌ అందిస్తోన్న స్పీడ్‌ను టెలికాం నెట్‌వర్క్‌ ఆపరేటర్‌కు తెలియజేస్తే మీరు ఉండే పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ను బూస్ట్‌ చేసేందుకు చర్యలను తీసుకుంటారు. 
చదవండి: Google Pay: గూగుల్‌ పేలో ఆ సేవలు కష్టమే..!

ఊక్లా ఇంటర్నెట్‌ స్పీడ్‌టెస్ట్: ఊక్లా , ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరు కొలమానాలను అందించే వెబ్ సర్వీస్ సంస్థ. ప్రముఖ టెలికాం కంపెనీలు ఊక్లా టెస్ట్‌ను ఆధారం చేసుకొనే నెట్‌వర్క్‌ స్పీడ్‌ను ప్రకటిస్తాయి. యాపిల్ స్టోర్‌లో అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఇది అత్యంత విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. యాప్‌లో యూజర్ లొకేషన్‌తో పాటు ఇతర అనుమతులను ఊక్లా అడుగుతోంది. 

స్పీడ్‌టెస్ట్ మాస్టర్: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను  పరీక్షించడానికి స్పీడ్‌టెస్ట్ మాస్టర్ సులభమైన అప్లికేషన్. ఇది 4జీ, డీఎస్‌ఎల్‌, 5జీ, ఏడీఎస్‌ఎల్‌ వంటి వివిధ నెట్‌వర్క్‌ల వేగాన్ని పరీక్షించే అవకాశం ఉంది. 

మోటియోర్‌ : ఈ యాప్‌ను ఉపయోగించి అతి తక్కువ స్థాయిలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ను కొలవవచ్చును.

గూగుల్‌ స్పీడ్ టెస్ట్ : మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయకూడదనుకుంటే మీకు గూగుల్‌ స్పీడ్‌ టెస్ట్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి గూగుల్‌ స్పీడ్ టెస్ట్‌ని సెర్చ్ చేశాక ...గూగుల్‌ స్పీడ్‌ టెస్ట్‌పై క్లిక్‌ చేశాక మీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్ వేగం, ఆప్‌లోడ్‌ వేగాలను గుర్తించవచ్చును. 
చదవండి: సడన్‌గా కాల్‌ డిస్‌కనెక్ట్‌ అవుతోందా..! ఇలా చేయండి..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top