‘పెట్రోల్‌ లేకపోయినా.. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ పెట్టుకోవచ్చు’

Central Govt Issues New Guidelines On Petrol Pump Setup - Sakshi

న్యూఢిల్లీ:సడలించిన నూతన పెట్రోల్‌ పంపుల లైసెన్స్‌ నిబంధనల కింద.. పెట్రోల్, డీజిల్‌ విక్రయాల కంటే ముందే సీఎన్‌జీ, ఈవీ చార్జింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 నవంబర్‌ 8 నాటి నిబంధనల విషయమై ఈ మేరకు తాజాగా వివరణ ఇచ్చింది. 

ఈ నూతన నిబంధనల కింద.. పెట్రోల్, డీజీల్‌ విక్రయాలతో పాటు ఏదైనా ఒక నూతన తరం ప్రత్యామ్నాయ ఇంధన విక్రయాలను (సీఎన్‌జీ లేదా ఎల్‌ఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్‌ లేదా బయో ఇంధనం) కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, దీన్ని తప్పనిసరి ఆదేశంగా చూడొద్దని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల పెట్రోలు బంకుకి అనుమతి పొందిన సంస్థలు. పెట్రోలు, డీజిల్‌ విక్రయాని కంటే ముందే ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవచ్చు. 
 

చదవండి : వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top