Dolly Jain: The Celebrity Saree Draper Charges Rs 35K To 2 Lakh - Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలకు చీరలు కట్టేది ఈమే.. ఎంత సంపాదిస్తోందో తెలుసా?

Apr 21 2023 2:45 PM | Updated on Apr 21 2023 3:01 PM

celebrity draping artist dolly jain charges rs 35000 to 2 lakhs for draping - Sakshi

భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రత్యేకతే వేరు. మగువ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది చీర. సినిమా హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు పలు ఈవెంట్లలో చీరలో మెరుస్తుంటారు. అయితే వారి చీరకట్టు వెనుక ఉన్నది మాత్రం డాలీ జైన్.

పెళ్లి వేడుకలైనా లేదా ఏదైనా ఈవెంట్ అయినా సరే చీర కట్టడం లేదా దుపట్టా కట్టడం విషయంలో డాలీ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆమె కేవలం 18 సెకన్లలో చీర కట్టగలదు. అది నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అయితే ఆమె సంపాదన చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌! 

డాలీ జైన్ చీరకట్టుతో మెరిసిన కొంతమంది సెలిబ్రిటీల గురించి ఇటీవల రెడ్డిట్‌లో షేర్‌  చేశారు. తనకు 325 రకాల డ్రేపింగ్ స్టైల్స్ తెలుసని డాలీ చెబుతుంటారు. దీపికా పదుకొణె రిసెప్షన్ చీర, సోనమ్ మెహందీ, అలియా భట్, నయనతారల పెళ్లి చీరలు కట్టింది ఆమె.

 

కాగా డాలీ జైన్‌ చీర కట్టడానికి ఒక్కొక్కరితో తీసుకుంటున్న మొత్తం గురించి తెలిసి నెటిజెన్లు నోరెల్లబెడుతున్నారు. పలు నివేదికల ప్రకారం, చీర కట్టడానికి  డాలీ ఒక్కో  సెలబ్రిటీ నుంచి  రూ. 35,000 నుంచి  రూ.2 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆమె అద్భుతమైన ప్రతిభను చూసి కొంతమంది ప్రశింసించగా మరికొంత మంది ఆమె సంపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ ప్రారంభోత్సవ  వేడుకల్లో అంతర్జాతీయ సెలెబ్రిటీ జిగి హడిద్‌కు డాలీ అందంగా చీర కట్టి ప్రశంసలు  అందుకుంది. ఇది మాత్రమే కాదు, మెట్ గాలా 2022 ఈవెంట్‌లో  నటాషా పూనావాలా ధరించిన బంగారు చీరను కూడా కట్టింది డాలీనే.

డాలీ జైన్ డ్రేపింగ్‌ (చీరలు, లెహంగాలు కట్టడం) వృత్తిగా తీసుకోవడానికి వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇంత అందంగా చీరలు కట్టే డాలీకి మొదట్లో చీరలు కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ తన అత్త ఆమెను చీర తప్పా మరో డ్రెస్‌ను ధరించనిచ్చేది కాదు. దీంతో చీరకట్టును అలవాటు చేసుకున్న డాలీ జైన్‌ దాంట్లోనే ప్రావీణ్యం సంపాందించి దాన్ని వృత్తిగా స్వీకరించారు. ఇండియన్ ఐడల్ 13 అనే రియాలిటీ షో పాల్గొన్న ఆమె ఆమె తన ప్రయాణం గురించి వివరించారు. ఏదో ఒకటి సాధించాలని కలలు కనే గృహిణులందరికీ డాలీ జైన్ నిజమైన స్ఫూర్తి.

ఇదీ చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement