చిక్కుల్లో యాపిల్‌..విచారణకు ఆదేశాలు

Cci Orders Investigation Into Apple Business In India - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్‌ తగిలింది. భారత్‌లో యాపిల్‌ అనైతిక బిజినెస్‌ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ఆదేశాలు జారీ చేసింది. 

"టుగెదర్ వుయ్ ఫైట్ సొసైటీ" అనే ఫిర్యాదుదారు ప్రకారం.. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్లను అనుమతించరు. అటువంటి సర్వీసులను ఆఫర్‌ చేయడంకు యాప్‌ డెవలపర్లతో అగ్రిమెంట్‌లు చేసుకుంటూ వారిని నిరోధించే ప్రయత్నం చేస‍్తుందంటూ ఫిర్యాదు దారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఫిర్యాదు నేపథ్యంలో సీసీఐ యాపిల్‌పై విచారణ చేపట్టాలంటూ 20పేజీల లేఖను రాసింది. ఆ లేఖలో అగ్రిమెంట్‌లు ద్వారా యాప్‌ డిస్ట్రిబ్యూటర్లు, యాప్‌ స్టోర్‌ డెవలపర్లు యాప్‌ మార్కెట్‌లోకి వెళ్లలేకపోతున్నారని పేర్కొంది. అందుకే సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని సీసీఐ ఆదేశాలు జారీ చేసింది.  

చదవండి: స్మార్ట్‌ ఫోన్‌ ఇండస్ట్రీలో కింగ్‌..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top