క్రిప్టోకరెన్సీ.. ఇలాంటి నేరాలే జరుగుతాయ్‌ జాగ్రత్త! | Canada Teen Arrested After Theft Millions Worth Cryptocurrency | Sakshi
Sakshi News home page

270 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ చోరీ! ఆపై ఆ 17 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే..

Nov 29 2021 1:55 PM | Updated on Nov 29 2021 3:16 PM

Canada Teen Arrested After Theft Millions Worth Cryptocurrency - Sakshi

కనిపించని క్రిప్టోకరెన్సీ.. జీవితాల్ని తలకిందులు చేస్తోంది. ఆర్థికంగా చితికిపోయేలా చేస్తూ ప్రాణం మీదకు..

ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీ చెలామణిపై ఆర్బీఐ ఆందోళన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల కోణంలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఆర్థిక నేరాలతో పాటు అమాయకులూ బలి అవుతారంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్‌ కరెన్సీ విషయంలో కొత్త తరహా నేరాలు తప్పవని సైబర్‌ నిపుణులు సైతం వారిస్తున్నారు. 


అందుకు ఉదాహరణగా తాజాగా రికార్డైన క్రిప్టోకరెన్సీ భారీ చోరీ కేసును ప్రస్తావిస్తున్నారు.  తాజాగా  ఓ టీనేజర్‌ ఏకంగా 46 మిలియన్‌ కెనడా డాలర్లు( 36.5 మిలియన్‌ అమెరికా డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 270కోట్ల రూపాయలపైనే) క్రిప్టోకరెన్సీని కాజేశాడు. కెనడా హామిల్టన్‌కు చెందిన 17 ఏళ్ల ఆ పిలగాడు.. అంత డబ్బుతో ఏం చేశాడో తెలుసా? ఆన్‌లైన్‌ గేమింగ్‌లో అరుదైన ఓ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేశాడు. స్విమ్‌ స్కాపింగ్‌(సెల్యూలార్‌ నెట్‌వర్క్‌ ఉద్యోగుల్ని డూప్లికేట్‌ నెంబర్ల ద్వారా బురిడీకొట్టించి.. బాధితుల అకౌంట్‌లను హ్యాక్‌ చేయడం) ద్వారా ఆ టీనేజర్‌ ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

దీంతో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక వ్యక్తి ఇంత భారీస్థాయిలో క్రిప్టోకరెన్సీ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. నిజానికి ఈ చోరీ జరిగింది కిందటి ఏడాదిలో.  బాధితుడు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జోష్‌ జోన్స్‌!. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది.
 

క్లిక్‌ చేయండి: క్రిప్టోకరెన్సీ.. నీటి బుడగల్లాంటివి
 

హామిల్టన్‌ సిటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగించింది ఎఫ్‌బీఐ. అయితే అరుదైన ఆ యూజర్‌ నేమ్‌ దొంగను పట్టించింది. అంతేకాదు మొత్తం సొమ్ములో కేవలం ఏడు మిలియన్ల సొమ్ము మాత్రమే రికవరీ అయ్యిందని తెలుస్తోంది. కంటికి కనిపించని ఈ కరెన్సీని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి నేరాలకు గురై భారీగా మోసపోవాల్సి వస్తుందని క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు సైబర్‌ ఎక్స్‌పర్ట్స్‌.

చదవండి: క్రిప్టో కరెన్సీ చేతికి రాలేదని.. ఖమ్మంవాసి బలవన్మరణం

Advertisement
 
Advertisement
Advertisement