బైజూస్‌ ప్రమోటర్ల వాటా పెంపు!

Byjus Founder Seeks Funds To Raise Stake To 40 Pc Of Edtech Major - Sakshi

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ వ్యవస్థాపకులు వాటాను పెంచుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్‌కు సంయుక్తంగా బైజూస్‌లో 25 శాతం వాటా ఉంది. ఈ వాటాను 40 శాతానికి పెంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధి వర్గాలు తెలియజేశాయి. ఇందుకు ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి.

కాగా.. గతేడాది(2022) మే నెలలో బైజూస్‌ వ్యవస్థాపకులు తమ వాటాను 23 శాతం నుంచి 25 శాతానికి పెంచుకున్నారు. బైజు రవీంద్రన్‌ 80 కోట్ల డాలర్ల నిధులు చేకూర్చడం ద్వారా వాటా పెంపునకు తెరతీశారు. మార్చికల్లా కంపెనీ నష్టాలను వీడీ లాభాల బాటలోకి ప్రవేశించనున్నట్లు బైజూస్‌ పేర్కొంటోంది. 2020–21లో కంపెనీ రూ. 4,588 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం 2019–20లో రూ. 232 కోట్ల నష్టం నమోదైంది. 2020లో సాధించిన రూ. 2,511 కోట్ల నుంచి ఆదాయం సైతం 2021లో రూ. 2,428 కోట్లకు నీరసించింది.

చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top