బైజూస్‌ భారీగా నిధుల సమీకరణ

Byju valued at 18 billion dollers in new funding - Sakshi

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ తాజాగా భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. వీటిలో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్‌ సగం పెట్టుబడులు అందించినట్లు బైజూస్‌ పేర్కొంది. తాజా రౌండ్‌లో 80 కోట్ల డాలర్లు(సుమారు రూ. 6,000 కోట్లు) సమకూర్చుకున్నట్లు తెలిపింది. నిధులు అందించిన కంపెనీల్లో సుమేరు వెంచర్స్, విట్రువియన్‌ పార్ట్‌నర్స్, బ్లాక్‌రాక్‌ ఉన్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా పెట్టుబడులను 22 బిలియన్‌ డాలర్ల విలువలో కంపెనీ సమీకరించింది. తాజా పెట్టుబడుల్లో బైజు రవీంద్రన్‌ 40 కోట్ల డాలర్లు సమకూర్చినట్లు, 9–12 నెలల్లోగా పబ్లిక్‌ ఇష్యూకి రానున్న కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడులతో రవీంద్రన్‌ వాటా 23% నుంచి 25%కి పెరిగినట్లు తెలియజేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top