యూట్యూబ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే అవకాశాలను కల్పించనున్నట్లు హైదరాబాదీ సంస్థ డబ్ల్యూకామర్స్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ శ్రీరామనేని తెలిపారు. ఈ విధానంలో పెట్టుబడి, సరుకుల నిల్వలాంటి బాదరబందీ ఉండదని.. చిరు వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు ఎవరైనా దీన్ని ప్రారంభించవచ్చని వివరించారు.
ఇందుకోసం కంపెనీ తాము ఆఫర్ చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు, విక్రేతల పేరుతో ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేస్తుంది. దాని లింకులు/క్యూఆర్ కోడ్‌లను విక్రేతలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా తెలిసినవారికి షేర్ చేయాలి. వాటి ఆధారంగా జరిగే ఆయా ఉత్పత్తుల అమ్మకాలపై విక్రేతకు 20–40 శాతం లాభం ఉంటుంది.
డెలివరీ బాధ్యతలను కంపెనీ తీసుకుంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22,000కు పైగా యాక్టివ్ ఆన్‌లైన్ స్టోర్స్ ఉన్నాయని, హెల్త్, వెల్‌నెస్ తదితర విభాగాల్లో 40కి పైగా బ్రాండ్స్, 600 పైచిలుకు ఉత్పత్తులు ఉన్నాయని శ్రీధర్ చెప్పారు.


