సామాన్యులకు మరో షాక్‌..భారీగా పెరగనున్న బిస్కెట్‌ ధరలు..!

Britannia price plans shows coming inflationary pain - Sakshi

రష్యా ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో క్రూడాయిల్‌ నుంచి వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను హెచ్‌యూఎల్‌, యూనిలీవర్‌ వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు నిత్యవసర వస్తువుల ధరలను భారీగా పెంచేందుకు సిద్దమయ్యాయి. ఇప్పుడు ధరల పెరుగుదల జాబితాలోకి బిస్కట్లు కూడా వచ్చి చేశాయి.  రానున్న రోజుల్లో బిస్కెట్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ధరల పెంపుకు బ్రిటానియా సిద్ధం..!
భారత అతిపెద్ద బిస్కెట్ల తయారీదారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్..బిస్కెట్ల ధరలను 7 శాతం మేర పెంచాలని ప్రణాళికలను రచిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంపును సూచించగా...ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటానియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ బెర్రీ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని వరుణ్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావంతో గత త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను నమోదుచేసింది.  

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రకటించినప్పటీనుంచి...కార్మికుల కొరత, సప్లై చైన్‌ వంటి పరిమితులతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు భారంగా మారింది. ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమైందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. కాగా బ్రిటానియాతో పాటుగా...ఇతర బిస్కెట్‌ కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ​కాగా ధరలను పెంచే బదులుగా క్వాంటిటీ తగ్గించి అమ్మకాలు జరపాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తోన్నారు. 

చదవండి: ఆల్‌టైం రికార్డు ధరకు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top