
హైదరాబాద్: ఫ్యూచర్‌గ్రూప్ స్టోర్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఆఫర్‌ను ప్రకటించింది. బ్రాండ్ ఫ్యాక్టరీలో ‘‘2 కొంటే 3 ఉచితం’’ ఆఫర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్ట్ 16వరకు కొనసాగే ఈ ఆఫర్‌లో భాగంగా 200కు పైగా విదేశీ, దేశీయ బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ నద్వానీ తెలిపారు. ఇందుకు కస్టమర్లు 7506313001కి మిస్‌కాల్ ఇచ్చి అపాయింట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నద్వానీ పేర్కొనారు.