క్రిప్టోకరెన్సీ బిల్లుపై క్యాబినెట్‌ నోట్‌ సిద్ధం

Bill Ready For Cryptocurrency Waiting For Cabinet Approval Says Nirmala Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ (బిల్లు)పై కేబినెట్‌ నోట్‌ సిద్దమైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం గురించి తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిప్టోపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక మంత్రిత్వ స్థాయి కమిటీ ఇప్పటికే దీనిపై తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీచేసే ఏదైనా వర్చువల్‌ కరెన్సీ మినహా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలనూ భారత్‌లో నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది.

కాగా,గతంలో ఓ వర‍్చువల్‌ కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రవిశంకర్‌ మాట్లాడుతూ.. త్వరలోనే డిజిటల్‌ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్‌బీఐ పనిచేస్తోంది. హోల్‌సేల్, రిటైల్‌ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ‍్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్‌ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తుండగా.. పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం వినియోగిస్తున్నాయి.

చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top