బ్యాంకులకు ఆర్‌బీఐ స్పష్టీకరణ
ముంబై: రికవరీ ప్రక్రియ కింద లేదా ఇతరత్రా అసాధారణ పరిస్థితుల్లో స్వా«దీనం చేసుకున్న స్థిరాస్థిని బ్యాంకులు తిరిగి రుణగ్రహీతకు గానీ లేదా వారికి సంబంధించిన వారికి గానీ విక్రయించకూడదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. వివిధ మార్గాల్లో స్వాధీనం చేసుకున్న నిర్దిష్ట ఆర్థికయేతర అసెట్స్‌ను విక్రయించడంపై బ్యాంకులు పాటించాల్సిన విధి విధానాలపై ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇలాంటివాటిని గరిష్టంగా ఏడేళ్లలోగా బహిరంగ వేలంలో విక్రయించాలని పేర్కొంది.
కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ అంశంపై మే నెలలో ఆర్‌బీఐ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ఇలాంటి ప్రాపర్టీలను తిరిగి కొనుగోలు చేసేందుకు రుణగ్రహీతలకు కూడా అవకాశం కల్పించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలకు తిరిగి సదరు ప్రాపరీ్టని దక్కించుకోవడానికి ప్రాధాన్యత కల్పిస్తే.. రుణాలపరమైన క్రమశిక్షణకు విఘాతం కలుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.


