తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి... | Sakshi
Sakshi News home page

Bank Loans: తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి...

Published Wed, Oct 11 2023 12:38 PM

Bank Tending To Personal Loans - Sakshi

బ్యాంకులు ఎక్కువగా కార్పొరేట్‌ రుణాల ద్వారానే అధికంగా లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా బ్యాంక్‌ రుణాల సరళిమారుతోంది. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీయల్‌ రంగానికి అధికంగా రుణాలు ఇస్తున్న బ్యాంకులు..ప్రస్తుతం వాటి వాటా తగ్గిస్తున్నాయి. అందుకు బదులుగా వ్యక్తిగత రుణాల ఇవ్వడంలో మొగ్గు చూపుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 

అయితే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నివేదిక ప్రకారం.. బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో దాదాపు 32.1శాతం వ్యక్తిగత రుణాలు, సర్వీస్‌ సెక్టార్‌కు 28.4శాతం, ఇండస్ట్రీ రంగానికి 26.2 శాతం, 13.3శాతం వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. హౌజింగ్‌, వెహికిల్‌, క్రెడిట్‌ కార్డు రుణాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో ఇండస్ట్రీ రంగానికి ఇచ్చే రుణాలు 46శాతం నుంచి 26శాతం మేర క్షీణించాయి. అదే వ్యక్తిగత రుణాలు మాత్రం 18శాతం నుంచి 32శాతానికి పెరిగాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఇతర హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల సంఖ్య పెరగడంతో అవి సర్వీస్‌ రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువగా రుణాలు కల్పిస్తున్నాయి. (తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..)

ఇండస్ట్రీయల్‌ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించడంతో కార్పొరేట్‌ కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. అయితే కంపెనీలు రుణ సమీకరణతో పాటు సంస్థ ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు వి.విశ్వనాథన్‌ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్‌ కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి బదులుగా డెట్‌మార్కెట్‌ ద్వారా నగదును పెంచుకుంటున్నాయి. తమ బ్యాలెన్స్‌షీట్లో నగదు ఎక్కువగా ఉన్న కొన్ని సంస్థలు రుణం తీసుకోవలసిన అవసరం ఉండడం లేదు. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకు నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించిన నియామాలు మార్చడం వల్ల కూడా ఇండస్ట్రీయల్‌ రుణాలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement