Namma Yatri App: దూకుడు: ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ

Bangalore auto unions Namma Yatri app surges before launch - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్నాటకలో యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలు అందించే ఓలా, ఉబెర్‌, ర్యాపిడో ఊహించని దెబ్బపడింది. అధిక చార్జీలు, వ్యవహార  తీరుతో తీవ్ర విమర్శల పాలై,  అక్కడి సర్కార్‌ ఆగ్రహానికి  గురైన దిగ్గజాలకు అనూహ్యంగా మరో షాక్‌ తగిలింది. బెంగుళూరు ఆటో రిక్షా డ్రైవర్లు సొంతంగా ఒక యాప్‌ను రూపొందించుకున్నారు. లాంచింగ్‌కు ముందే  'నమ్మ యాత్రి'  అప్లికేషన్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 

బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) నవంబర్ 1న తన  నమ్మయాత్రి సేవలను షురూ చేయనుంది.  అయితే ఈ యాప్ ఇప్పటికే 10,000 డౌన్‌లోడ్స్‌ సాధించింది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేలా చార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఫీజు ఫిక్స్‌ చేశారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. 

ప్రత్యర్థులకు సమానమైన ఇంటర్‌ఫేస్‌తో 'సరసమైన ధరల' వద్ద  సేవలను అందిస్తుండటం విశేషం. దీంతో  ఈ యాప్‌ చాల బావుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌పై సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి. పికప్, డ్రాప్ లొకేషన్‌లను సెట్ చేసిన తర్వాత, సమీపంలోని డ్రైవర్‌లు చార్జీని కోట్‌ చేస్తారు. సాధారణంగా పికప్ , డ్రాపింగ్‌ ప్లేస్‌ దూరాన్ని బట్టి అదనంగా 10-30 రూపాయల వరకు అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ   వసూలు చేయనుంది చిన్మయ్ ధుమాల్ అనే  దీనిపై  ట్వీట్‌ చేశారు.

కాగా  రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై ఓలా, ఉబెర్‌, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.దీనిపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను 2022, నవంబర్‌ 7కు వాయిదా వేసిసి సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top