యాక్సిస్‌ బ్యాంక్, శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ జట్టు

Axis Bank, Shriram Housing Finance announce partnership for co- lending - Sakshi

ముంబై: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్, శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఎస్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌) సంస్థలు చేతులు కలిపాయి. యూబీ కో.లెండ్‌ ప్లాట్‌ఫాం ద్వారా రుణాలు ఇచ్చేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీనితో చిన్న, మధ్య తరహా సంస్థలకు అలాగే గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాల్లోని మధ్య.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందించనున్నాయి.

ఆర్థిక రంగంలో యాక్సిస్‌ బ్యాంక్, లోన్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో ఎస్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ అనుభవాలు.. రుణ గ్రహీతల ప్రొఫైల్‌ను మదింపు చేసి, రుణాలు ఇచ్చేందుకు ఉపయోగపడగలవని ఇరు సంస్థలు తెలిపాయి. ఎంఎస్‌ఎంఈలు, అఫోర్డబుల్‌ హోమ్‌ సెగ్మెంట్లలో విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని యాక్సిస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ మునీష్‌ షర్దా, ఎస్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ రవి సుబ్రమణియన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top