ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాల్లో అదరగొట్టిన ఏథర్‌

Ather Energy sold Record escooters in May 2022 - Sakshi

సాక్షి,ముంబై: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్, ఏథర్ ఎనర్జీ  బంపర్‌ సేల్స్‌ సాధించింది. 2022 , మే  నెలలో ఇండియాలో 3,787 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ మేరకు సంస్థ  సేల్స్‌ వివరాలను వెల్లడించింది.  గత  ఏడాదితో పోలిస్తే సేల్స్‌ నిరాశాజనకంగా ఉన్నప్పటికీ,  ఈ ఏడాదిలో   గత నెలలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేయడం విశేషం. 

అయితే  ఏప్రిల్ 2022లో 3,779 యూనిట్లతో పోలిస్తే ఏథెర్ అమ్మకాలలో కేవలం 0.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. 450ఎక్స్‌,  450 ప్లస్ స్కూటర్‌కు మంచి ఆదరణ లభించిందని పైథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, రవ్‌నీత్ ఎస్‌ ఫోకెలా తెలిపారు. అలాగే దిగ్గజ సంస్థ హీరో మోటో కార్ప్‌తో  నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 128 మిలియన్ డాలర్లను సాధించడం సంతోషంగా ఉందన్నారు.

కాగా దేశంమొత్తంమీద ఈవీ ఛార్జింగ్ గ్రిడ్‌ల  ఏర్పాటుకు  Magentaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం 35 నగరాల్లో దాదాపు 330కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. రాబోయే మూడేళ్లలో 5వేల పాయింట్లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top