రూ. 25 వేలకే టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్

Asus Chromebook Detachable CM3 With MediaTek 8183 SoC Launched - Sakshi

అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్‌ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్‌ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. 

అసుస్ క్రోమ్‌బుక్ ఫీచర్లు 
ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్‌లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు.

ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

చదవండి: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top