ఆసియన్‌ గ్రానిటో రైట్స్‌ ఇష్యూ సెప్టెంబరు 23 నుంచి

Asian Granito India Ltd.'s Rs. 224. 65 crores rights issue to open - Sakshi

న్యూఢిల్లీ: టైల్స్‌ తయారీలో ఉన్న ఆసియన్‌ గ్రానిటో రూ.224.65 కోట్ల రైట్స్‌ ఇష్యూ సెపె్టంబరు 23న ప్రారంభం కానుంది. అక్టోబరు 7న ముగియనుంది. ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.100గా నిర్ణయించారు. ఇష్యూ తదనంతరం మొత్తం షేర్లు 3.42 కోట్ల నుంచి 5.67 కోట్లకు చేరతాయి. రుణాల చెల్లింపులకు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2–3 ఏళ్లలో రుణ రహిత కంపెనీగా నిలవాలన్నది ఆసియన్‌ గ్రానిటో లక్ష్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top