తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!

Apple store Delhi Saket records around Rs 2 crore in first 10 days - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్‌ ఓపెన్‌ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్‌గా నిలుస్తోంది.  (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్‌ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?)

ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు  లీజుకు తీసుకుని మరీఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్‌ ఐఫోన్లు,ఎయిర్‌ పాడ్స్‌, ఐప్యాడ్స్‌, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది.  ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్‌ కార్డ్‌ లోన్స్‌: ఇకపై ఇలా చేయలేరు!)

ఇండియాలో రెండో స్టోర్‌గా యాపిల్‌ సాకేత్‌ను ఢిల్లీలో ఏప్రిల్ 20న  యాపిల్‌ సీఈవో టిక్‌ కుక్‌ లాంచ్‌ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్‌ను లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20  ప్రత్యర్థిబ్రాండ్‌ల స్టోర్స్‌ లేకుండా  జూలై 2022లో మాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్‌.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top