యాప్ స్టోర్ నుంచి పార్లర్ యాప్ తొలగింపు

Apple Removes Parler from the App Store - Sakshi

అమెరికాకు చెందిన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ పార్లర్ ను యాప్ స్టోర్ నుంచి తొలగించినట్లు ఆపిల్ పేర్కొంది. అమెరికాలోని క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడికి పార్లర్‌ యాప్ ను ఉపయోగించినట్లు ఆపిల్ ఆరోపిస్తుంది. తమ యాప్ స్టోర్‌లో ఉండటానికి సోషల్ మీడియా సంస్థ తన యాప్‌లో మార్పులు చేయమని పార్లర్‌కు ఆపిల్ సూచించింది. 24 గంటలు గడిచిన కూడా ఎటువంటి మార్పులు చేయకపోవడంతో యాప్ స్టోర్ నుంచి పార్లర్‌ను తొలిగించినట్లు పేర్కొంది.(చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి)   

పార్లర్ నిర్వాహకులు కూడా తమ యాప్ లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి కొంచెం సమయం కావాలని కోరినట్లు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలను ఆపిల్ తిరస్కరించింది. ఈ యాప్‌లో హింసను ప్రేరేపించే చట్ట వ్యతిరేక చర్యలకు పిలుపునివ్వడం ఇప్పటికే గమనించినట్లు ఆపిల్ పేర్కొంది. మీ యాప్‌లో ప్రమాదకరమైన కంటెంట్‌ను తొలగించడానికి ఉపయోగించే ఫిల్టర్లు ఏర్పాటు చేసేవరకు తమ యాప్‌లో స్థానం లభించదు అని పేర్కొంది. పార్లర్‌ యాప్‌ ఐఫోన్‌, ఐపాడ్‌ ఇతర యాపిల్‌ పరికరాల్లో తొలగించినట్లు ఆపిల్ పేర్కొంది. దీంతో పాటు గూగుల్ కూడా తమ ప్లేస్టోర్ నుంచి పార్లర్ ను తొలగించినట్లు పేర్కొంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top