Apple CEO Tim Cook: భారత్‌లో యాపిల్‌ బిజినెస్‌ జోరు, ఆనందంలో టిమ్‌ కుక్‌

Apple Iphone Sales Are Increasing In India Says Tim Cook - Sakshi

భారత్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లలో అమ్ముడవుతున్న అన్నీ ఫోన్‌లలో కంటే యాపిల్‌ ఐఫోన్‌లు చాలా ఖరీదు. ఇదే విషయం ఆ ఫోన్‌ల అమ్మకాల్లో తేలింది. కానీ ట్రెండ్‌ మారింది. తాజాగా విడుదలైన క్యూ3 ఫలితాల్లో ఐఫోన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల విడుదలైన 2021 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌లో ఐఫోన్‌ అమ్మకాలు పెరిగాయని, ఈ విషయంలో యాపిల్‌ సంస్థ అరుదైన ఘనతను సాధించిందని కొనియాడారు. అయితే భారత్‌లో ఐఫోన్‌ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఐఫోన్‌ 13 తో దశ తిరిగింది.  
టెక్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 13 విడుదల ముందు వరకు భారత్‌లో గడ‍్డు పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఎందుకంటే మిగిలిన టెక్‌ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లు,గాడ్జెట్స్‌ ధరలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేవి. కానీ యాపిల్‌ విడుదల చేసే ఐఫోన్‌లలో ఫీచర్లు బాగున్నా ధరలు ఆకాశాన్నంటేవి. అందుకే ఐఫోన్‌ అమ్మకాలు ఆశాజనకంగా లేవని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్‌ 13 సిరీస్‌ విడుదలతో భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌ అమ్మకాల దశ తిరిగింది.  

కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ఏం తేల్చింది
మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ క్యూ3 ఫలితాల్లో యాపిల్‌ సంస్థ 212 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని పేర్కొంది. యాపిల్‌ కంపెనీ ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో (రూ. 30,000 కంటే ఎక్కువ ఉన్న ఫోన్‌లు) 44 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతుందని తెలిపింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో 74 శాతం మార్కెట్ వాటాతో (రూ. 45,000 పైన ఉన్న ఫోన్‌లు) ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. అయితే ఇలా సేల్స్‌ పెరగడానికి యాపిల్‌ తెచ్చిన ఫీచర్లేనని తెలుస్తోంది.   

పెద్ద ఐఫోన్ స్క్రీన్‌లు
2017 నుంచి యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ల స్క్రీన్‌ సైజ్‌ను పెంచుతూ వచ్చింది.ఇక తాజాగా స్క్రీన్‌ సైజ్‌ పెరిగిన ఫోన్‌లలో  ఐఫోన్‌ 11,ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13 ఫోన్‌లు ఉన్నాయి. దీంతో పాటు మిగిలిన ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లతో పోలిస్తే యాపిల్ ఇప్పుడు 6 అంగుళాల డిస్‌ప్లేతో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తోంది. తద్వారా ఐఫోన్‌ వినియోగదారులు ఈజీగా సినిమాలు, గేమ్స్‌, నెట్‌ బ్రౌజింగ్‌ ఈజీగా చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం యాపిల్‌ విడుదల చేస్తున్న ఐఫోన్‌లలో  4.7 అంగుళాల స్క్రీన్ నుండి 6.7 అంగుళాల వరకు ఐఫోన్‌లను అమ్ముతుంది.  

ఐఓఎస్‌ అప్‌డేట్‌లు  
ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు చాలా అవసరం. అందుకే అప్‌డేట్‌ విషయంలో ఆలస్యం చేసే యాపిల్‌ సంస్థ గత కొంత కాలంటే సాఫ్ట్‌వేర్ల విషయంలో అప్‌డేట్‌గా ఆలోచిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్‌ను ఆవిష్కరించిన కొన్ని రోజుల తర్వాత ఐఓస్‌ 15 అప్‌డేట్ చేసింది. 2015లో విడుదలైన ఐఫోన్‌ 6ఎస్‌ లో ఓఎస్‌ అప్‌డేట్‌లు చేస్తూ వస్తోంది.  

ఐఫోన్‌కు మరో అడ్వాంటేజ్‌ చిప్‌ సెట్‌ లు 
డిస్‌ప్లే ,సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు కాకుండా ఐఫోన్‌ సేల్స్‌ పెరగడానికి మరో కారణం చిప్‌సెట్. యాపిల్‌ బయోనిక్ చిప్‌సెట్‌లను వినియోగిస్తుంది. 2019నుంచి ఈ బయోనిక్‌ చిప్‌సెట్‌ల వినియోగం ప్రారంభమైంది.  ఈ బయోనిక్ చిప్ ఉన్న ఐఫోన్‌ల వినియోగం సులభంగా ఉన్నట్ల ఐఫోన్‌ లవర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజూవారి పనులే కాకుండా గేమింగ్‌, బ్రౌజింగ్‌ ఈజీగా చేస్తున్నట్లు వెల్లడించారు.   

చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్‌ ఇదే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top