గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్‌కున్న డిమాండ్! | Sakshi
Sakshi News home page

గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్‌కున్న డిమాండ్!

Published Sat, Sep 16 2023 8:15 PM

Apple iphone 15 Series Pro Bookings Details - Sakshi

ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజే వేరు. ఈ సంగతి అందరికి తెలుసు. ఇటీవల కంపెనీ కొత్త ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. కాగా నేడు (2023 సెప్టెంబర్ 16) ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపు ఐఫోన్15 ప్రో సిరీస్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్‌లు మొత్తం అమ్ముడైనట్లు తెలిసింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

నిజానికి ఈ నెల 12న యాపిల్ వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్‌కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..

గతంలో ఇలా..
గతంలో కూడా కేవలం యాపిల్ కంపెనీ ఫోన్స్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ వంటి కంపెనీల మొబైల్స్ కూడా భారీగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులకు నచ్చిన ఫీచర్స్ కలిగిన మొబైల్ తప్పకుండా మంచి బుకింగ్స్ పొందుతాయని స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement